బజాజ్ పల్సర్ N160 కొత్త టాప్ వేరియంట్ స్టైలిష్‌గా అందుబాటులోకి వచ్చింది. ఈ మోడల్‌లో ప్రధానంగా గోల్డెన్ USD ఫోర్క్స్, స్లిప్పర్ క్లచ్, కొత్త కలర్ ఆప్షన్లు వంటి ఫీచర్లు తో ఉంటుంది .
ఇంజిన్ లో , పెర్ఫార్మన్స్ లో ఎలాంటి మార్పు లేకుండా రైడింగ్ అనుభవం , లుక్‌ను మెరుగుపరచడమే లక్ష్యంగా బజాజ్ ఈ అప్డేట్ వేరియంట్ ను తీసుకువచ్చింది . డ్యూయల్ ఛానల్ ABS, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఆధునిక ఫీచర్లు ఈ వేరియంట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. రైడర్‌కు మరింత కంఫర్ట్ , సేఫ్టీ, ప్రీమియం ఫీల్ ఇవ్వడం ఈ కొత్త వేరియంట్ ప్రధాన ఆకర్షణ.ఈ వేరియంట్‌తో bajaj పల్సర్ అభిమానులకు స్టైల్ , టెక్నాలజీ తో అందిస్తుంది . కొత్త లుక్, మెరుగైన ఫీచర్లు, ఆధునిక రైడింగ్ అనుభవం కోరుకునే వారికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది.
బజాజ్ పల్సర్ N160
ఇది ఆధునిక స్పోర్టీ బైక్‌గా యువతను ఆకర్షించే విధంగా రూపొందించారు . ఇది 164.82cc ఆయిల్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. 16PS పవర్ , 14.65Nm టార్క్ ను అందిస్తుంది . 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రైడింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. మైలేజ్ సుమారు 45-50 kmpl వరకు అందిస్తుంది.ఇది రోజువారీ ప్రయాణాలకు సరైన ఎంపికగా నిలుస్తుంది.
ఫీచర్స్
డిజైన్ పరంగా మస్క్యులర్ ట్యాంక్, స్పోర్టీ బాడీ లైన్స్, ఆకర్షణీయమైన LED లైటింగ్ దీన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. కలర్ ఆప్షన్లలో పెర్ల్ మెటాలిక్ వైట్, బ్రూక్లిన్ బ్లాక్, రేసింగ్ రెడ్, గ్రే ఉన్నాయి. ఇవి రైడర్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి.
డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్/మెసేజ్ అలర్ట్స్, నావిగేషన్ సపోర్ట్ వంటి ఆధునిక టెక్నాలజీ ఫీచర్స్ ఉన్నాయి. సస్పెన్షన్‌లో ఫ్రంట్ USD టెలిస్కోపిక్ ఫోర్క్స్ , రియర్ మోనోషాక్ ఉండటం వల్ల రైడింగ్ మరింత స్థిరంగా ఉంటుంది.
బ్రేకింగ్ లో ఫ్రంట్ , రియర్ డిస్క్ బ్రేకులు, డ్యూయల్ ఛానల్ ABS ఉండటం వల్ల సేఫ్టీ మరింత మెరుగుపడుతుంది.17 ఇంచ్ అలోయ్ వీల్స్ , 795mm సీటు ఎత్తు, 1358mm వీల్‌బేస్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం ఉన్నాయి. ఈ బైక్ ప్రధానంగా స్టైల్, సేఫ్టీ, టెక్నాలజీ తో ఉంటుంది .
ధర
దీని ఎక్స్ షో రూమ్ ధర Rs 1.22 లక్షలు
పల్సర్ N160 స్పోర్టీ లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్లను కోరుకునే వారికి సరైన ఎంపిక. ఇది రోజువారీ ప్రయాణం, వీకెండ్ రైడ్స్, స్పోర్టీ రైడింగ్ అనుభవం ఇష్టపడే వారికీ బెస్ట్ గా నిలుస్తుంది. బజాజ్ ఈ మోడల్ ద్వారా యువతకు స్టైల్, పెర్ఫార్మన్స్ , సేఫ్టీని అందిస్తోంది.బజాజ్ పల్సర్ N160 తన సెగ్మెంట్‌లోని ఇతర బైక్‌లతో TVS అపాచే RTR 160, సుజుకి గిక్సర్, యమహా FZ, హీరో ఎక్స్‌ట్రీమ్ 160 4V వంటి మోడల్స్ కు పోటీని ఇస్తుంది . ఈ బైక్‌లు అన్ని 160cc సెగ్మెంట్‌లో రైడర్లకు స్టైల్, పెర్ఫార్మన్స్ , ఆధునిక ఫీచర్లను అందిస్తున్నాయి. పల్సర్ N160 తన మస్క్యులర్ డిజైన్, డ్యూయల్ ఛానల్ ABS, బ్లూటూత్ కనెక్టివిటీ, స్మూత్ రైడింగ్ అనుభవంతో ప్రత్యేకంగా నిలుస్తోంది.
Read more news like this on telugu.timesnownews.com

