Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బెంగళూరులో సెలబ్రేషన్స్‌పై బ్యాన్! ఆర్‌సీబీ గెలిస్తే.. బయటికి వస్తే, బాదుడే...

బెంగళూరులో సెలబ్రేషన్స్‌పై బ్యాన్! ఆర్‌సీబీ గెలిస్తే.. బయటికి వస్తే, బాదుడే...

Times Now Telugu 1 week ago

పీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కి వెళ్లింది. టేబుల్ టాపర్‌గా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, మొదటి క్వాలిఫైయర్‌లో గుజరాత్ టైటాన్స్‌పై సునాయాస విజయం అందుకుంది.

2009, 2016 సీజన్లలో ఫైనల్‌లో షాక్ ఇచ్చిన హైదరాబాద్ జట్టు, ఎలిమినేటర్ నుంచే ఇంటిదారి పట్టింది. అదీకాకుండా గత 8 సీజన్లలో మొదటి క్వాలిఫైయర్ గెలిచిన జట్లకే టైటిల్ దక్కుతూ వస్తోంది. దీంతో ఈసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అంచనాలు భారీగా ఉన్నాయి.

అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సారి కప్పు గెలిస్తే, వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ సరసన నిలుస్తుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత వరుసగా రెండు ఫైనల్స్ గెలిచిన కెప్టెన్‌గా అరుదైన ఘనత క్రియేట్ చేస్తాడు రజత్ పటిదార్..

  • బెంగళూరులో సెలబ్రేషన్స్‌పై బ్యాన్...

ఆర్‌సీబీ, ఒకవేళ ఐపీఎల్ 2026 టైటిల్ గెలిచినా సరే, బెంగళూరులో సెలబ్రేషన్స్‌పై బ్యాన్ విధించింది కర్ణాటక సర్కార్. 2025 ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన సెలబ్రేషన్స్‌లో తొక్కిసలాట జరిగి 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూరులో సెలబ్రేషన్స్‌పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. అలాగే అనుమతి లేకుండా రోడ్డు ఎక్కితే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పోలీసు శాఖ హెచ్చరించింది.

  • బయటికి వస్తే బాదుడే...

ఫైనల్ మ్యాచ్ అనంతరం బెంగళూరులో బైక్ ర్యాలీలు చేసినా, స్టంట్స్ చేసినా ఓవర్ స్పీడింగ్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నా.. వారిపై కఠిన చర్యలు ఉంటాయని బెంగళూరు పోలీసు శాఖ హెచ్చరించింది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu