Dailyhunt
బిగ్ బ్రేకింగ్... ఐ-ప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

బిగ్ బ్రేకింగ్... ఐ-ప్యాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు

Times Now Telugu 2 weeks ago

ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఐ ప్యాక్ కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తుంది. పశ్చిమ బెంగాల్ బొగ్గు అక్రమ రవాణా కేసు సంబంధించి దర్యాప్తు జరుపుతున్న ఈడీ...

ఐ ప్యాక్‌తో సంబంధం ఉన్న పలు ప్రదేశాలలో గురువారం సోదాలు జరుపుతుంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో ఈడీ సోదాలు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో ఐ ప్యాక్ సహ వ్యవస్థాపకులు రిషి రాజ్ సింగ్‌ నివాసం కూడా ఉంది.

ఐ ప్యాక్‌తో సంబంధం ఉన్న పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.బెంగళూరులోని రిషి రాజ్ సింగ్‌కు చెందిన ప్రాంగణం... హైదరాబాద్‌లోని ఐ ప్యాక్ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి.

అయితే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈడీ సోదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎందుకంటే... పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి ఐ-ప్యాక్ పొలిటికల్ కన్సల్టెన్సీ సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహాలు, ఐటీ, మీడియా కార్యకలాపాలను నిర్వహించడంలో ఐ-ప్యాక్ కీలక పాత్ర పోషిస్తుంది. టీఎంసీ తన ఎన్నికల వ్యూహాలను మెరుగుపరచుకోవడానికి, ఓటర్లతో సంబంధాలను మెరుగుపరుచుకోవడాని సహాయపడే విధంగా ప్రణాళికలను అందిస్తుంది.

ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ దాడులు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కూడా ఐ ప్యాక్ కార్యాలయాలు, ప్రమోటర్ల నివాసాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ దాడులలో కోల్‌కతాలోని లౌడన్ స్ట్రీట్‌లో ఉన్న ఐ ప్యాక్ ప్రమోటర్ ప్రతీక్ జైన్ నివాసం, సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయం కూడా ఉన్నాయి. ఆ సమయంలో ఈడీ సోదాలపై బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఇక, ఐ-ప్యాక్ ప్రమోటర్లు ప్రతీక్ జైన్, రిషి రాజ్ సింగ్‌లు తమకు జారీ చేసిన సమన్లను సంబంధించి సవాలు చేసిన పిటిషన్లపై బుధవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు సమన్లను వాయిదా వేయగలమని ఈడీ హైకోర్టుకు హామీ ఇచ్చింది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu