రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవడం వలన ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తవహించవచ్చు. నిపుణుల ప్రకారం, హైపర్ టెన్షన్‌గా పిలిచే అధిక రక్తపోటు వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి.
గుండె జబ్బులు, గుండె నొప్పు వంటి ప్రధాన సమస్యలు వస్తాయి. కాబట్టి రెగ్యులర్‌గా బీపీని మానిటర్ చేయడం వలన హైపర్ టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. అయితే బ్లడ్ ప్రెషర్ (BP)ను ఇంటి వద్ద చెక్ చేసుకోవడం మంచిదేనా? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?
ఢిల్లీ, AIIMS న్యూరాలజిస్ట్ డా, ప్రియాంక సెహ్రావత్ ప్రకారం, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సహాయంతో బ్లడ్ ప్రెషర్‌ను సులభంగా ఇంటి వద్దే చెక్ చేసుకోవచ్చు. అయితే రీడింగ్స్ కచ్చితంగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
" బ్లడ్ ప్రెషర్(BP) రీడింగ్‌లు తీసుకోవడానికి ముందు, ఐదు నిమిషాల పాటు బాగా విశ్రాంతి తీసుకోవాలి ," అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫాలోవర్లకు తెలిపారు.
ఎక్సర్‌సైజ్ చేసిన వెంటనే లేదా భోజనం చేసిన వెంటనే మీ బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ తీసుకోవద్దన ఆమె తెలిపారు. మీ శరీరం విశ్రాంతి స్థితిలో ఉంచాలి, దీనికోసం నిశ్శబ్దంగా కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. దీనివల్ల ఇతర కారకలు మీ రక్తపోటును తాత్కాలికంగా పెంచకుండా ఉంటాయి. ఇంటి వద్ద రక్తపోటు (BP)ను చెక్ చేసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
మూత్రవిసర్జన చేయాలి
రక్తపోటును చెక్ చేసుకోవాలనుకునే ముందు మూత్రవిసర్జన చేయాలని డాక్టర్ సెహ్రావత్ సూచించారు. మూత్రాశయం నిండుగా ఉండటం వలన రక్తపోటు ఎక్కువగా చూపించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మూత్రాశయం నిండుగా ఉండటం వలన చుట్టుపక్కల రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది, దీని వలన రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంది.
బీపీ చెక్ చేయడానికి 30 నిమిషాల ముందు కెఫైన్ తీసుకోవద్దు
బీపీ రీడింగ్స్ తీసుకోవడానికి కనీసం 30 నిమిషాల ముందు టీ, కాఫీ వంటి కెఫైన్ డ్రింక్స్ తీసుకోవద్దు. దీనితో పాటు ధూమపానం కూడా చేయకూడదు. కెఫైన్ నాడీ వ్యవస్థను స్టిమ్యులేట్ చేస్తుందని, దీని వలన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుందని, దీని వలన తాత్కాలికంగా రక్తపోటు పెరుగవచ్చని డాక్టర్ సెహ్రావత్ తెలిపారు.
భోజనం చేసిన వెంటనే చెక్ చేసుకోవద్దు
సాధారణంగా, భోజనం చేసిన వెంటనే జీర్ణవ్యవస్థ వైపు రక్త ప్రవాహం జరగడం వలన వల్ల రక్తపోటు కొంత సమయం వరకు తగ్గుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉప్పు, శాచురేటెడ్ ఫ్యాట్స్ లేదా కెఫిన్ వంటి కొన్ని ఆహార పదార్థాల వలన రక్తపోటు రీడింగ్ మారుతుంది.
కూర్చునే విధానం కూడా ముఖ్యమే
మీరు చదువుకోవడానికి కూర్చున్న విధంగా, వీపుకు తగినంత ఆధారం, చేతులు ఆనుకోవడానికి వీలుండేలా జాగ్రత్త వహించాలని డాక్టర్ సెహ్రావత్ అన్నారు. రక్తపోటును కొలిచే సమయంలో వంగి కూర్చోవడం వల్ల రీడింగ్‌లో వ్యత్యాసం ఏర్పడే అవకాశం ఉంది. మీరు చెక్ చేసుకునే బీపీ మెషిన్ చాలా బిగుతుగా ఉంచకూడదు, దీని వలన బ్లడ్ ప్రెషర్ రీడింగ్‌లో సమస్యలు రావచ్చు.
కుడి, ఎడమ రెండు చేతులు రెండు చెక్ చేయాలి
బ్లడ్ ప్రెజర్ చెక్ చేసుకునే సమయంలో రెండు చేతుల రీడింగ్స్ చెక్ చేసుకోవాలి. దీని ద్వారా కచ్చితమైన రీడింగ్స్ పొందవచ్చు. రెండు చేతుల్లో కనీసం 10 mm/Hg వ్యత్యాసం ఉండాలి. రెండింట్లో ఏది ఎక్కువగా ఉంటే ఆ రీడింగ్‌ను పరిగణలోకి తీసుకోవాలి.
ఇంటి వద్ద బ్లడ్ ప్రెషర్‌ను చెక్ చేసుకోవడం మంచిదే, రెగ్యులర్‌గా బీపీని మానిటర్ చేసుకోవచ్చు. అయితే వైద్యుల సలహా తీసుకోవడం ఎంతో ముఖ్యం.
Read more news like this on telugu.timesnownews.com

