Dailyhunt
BSNL: మరోసారి బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్, రూ.1కే 30 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 2 GB డేటా...ఆఫర్ ఎప్పటివరకు తెలుసా?

BSNL: మరోసారి బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్, రూ.1కే 30 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 2 GB డేటా...ఆఫర్ ఎప్పటివరకు తెలుసా?

Times Now Telugu 1 week ago

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసా సారి ఫ్రీడమ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.1 ప్లాన్ తన కస్టమర్ల కోసం ప్రవేశపెట్టింది.

రూ.1 బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) అందుబాటులోకి తెచ్చిన రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ నెల రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. 30 రోజుల పాటు డైలీ 2జీబీ డేటా, రోజుకు 100 SMSలతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అందించనుంది. వినియోగదారుల డిమాండ్ మేరకు ఈ ప్లాన్‌ను రీ లాంఛ్ చేసినట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.

ఆఫర్ ఎప్పటి వరకు ఉందంటే....

బీఎస్ఎన్ఎల్ మరోసారి ప్రవేశపెట్టిన రూ.1 ఫ్రీడమ్ ప్లాన్ ఏప్రిల్ 30,2026 వరకు అందుబాటులో ఉంటుంది. BSNL ఫ్రీడమ్‌ప్లాన్‌కు సంబంధించిన వివరాలను బీఎస్ఎన్ఎల్ ఇండియా సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. రూ.1 బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్ కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అందుబాటులోకి తెచ్చిన "బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ ప్లాన్" ను BSNL మరోసారి తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం ఆసక్తికలిగిన వినియోగదారులు సమీపంలో BSNL సర్వీస్ సెంటర్(CSC) లేదా రిటైలర్‌ను సంప్రదించాలని సూచించింది.

బీఎస్ఎన్ఎల్ రూ.1 రీఛార్జ్ ప్లాన్ బెనిఫిట్స్ ఇవే!

  • 30 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్
  • నెల రోజుల పాటు రోజు 2జీబీ హై స్పీడ్ డేటా
  • రోజు 100 ఎస్ఎమ్ఎస్‌లు
  • 30 రోజుల పాటు ప్లాన వ్యాలిడిటీ
  • దీనితో పాటు ఉచిత సిమ్ కూడా కస్టమర్స్ పొందవచ్చు.

BSNL ఇటీవలన అతి తక్కువ ధరకే వార్షిక రీచార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. నాన్ స్టాప్ కనెక్షన్ పేరుతో ఏడాది రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
BSNL వార్షిక రీఛార్జ్ ప్లాన్ ద్వారా పొందే ప్రయోజనాలు ఇవే!

  • రూ.2399కే బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తెచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది.
  • రోజుకు 2జీబీ డేటాతో పాటు, ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు.
  • దీనితో పాటు రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లు ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కేవలం రూ.61కే BSNL IFTV ప్రీమియమ్ ప్యాక్ అందుబాటులోకి తెచ్చింది. ఫైబర్ ఆప్టిక్ ద్వారా ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అందించే సర్వీస్...BSNL IFTV. దీని ద్వారా బీఎస్ఎన్ఎల్ యూజర్స్ లైవ్ టీవీ ఛానెల్స్ చూసే సదుపాయం ఉంది. సెట్-టాప్ బాక్స్ అవసరం లేకుండానే, ఎలాంటి అంతరాయం లేని, హై క్వాలిటీ స్ట్రీమింగ్‌ను పొందవచ్చు. FTTH (ఫైబర్-టు-ది-హోమ్) బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో సులభంగా ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్సపీరియెన్స్ పొందవచ్చు. బీఎస్ఎన్ఎల్ తమ యూజర్ల కోసం ఐఎఫ్‌టీవీ(BSNL IFTV) ప్రీమియమ్ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.61 రీఛార్జ్‌తో 1000కి పైగా ఛానెల్స్ అందిస్తుంది. స్టాటర్ ప్లే ప్లాన్‌ పేరుతో రూ.61 రీఛార్జ్ ప్లాన్‌, రూ.151తో లైట్ ప్లే హెచ్‌డీ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టింది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu