మహిళలు వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా? అయితే ఒకటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా మహిళలు తమ ఖాళీ సమయాన్ని వినియోగించుకొని ఈ బిజినెస్ చేయవచ్చు. తద్వారా వారికి అదనపు ఆదాయం లభించడంతో పాటు కుటుంబం ఆర్థిక సమస్యల బారిన పడకుండా కాపాడుకునే అవకాశం కల్పిస్తుంది. అలాంటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ పైన ప్రతి ఒక్కరిలోను అవగాహన పెరిగింది. ముఖ్యంగా సందర్భం ఏదైనా అయినప్పటికీ కేవలం షాపింగ్ చేసి దుస్తులను కొనుగోలు చేయడం మాత్రమే కాదు, వాటికి మెరుగులు దిద్దేలా డిజైనింగ్ చేయించుకోవడం కూడా డిమాండ్ భారీగా పెరిగింది అని చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా డిజైనింగ్ చేయించినటువంటి దుస్తులను వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ డిజైనింగ్‌లో ఎక్కువగా వాడే డిజైనింగ్ వర్క్ ఏదైనా ఉంది అంటే అది మగ్గం వర్క్ అని చెప్పవచ్చు. దీనినే జర్దోసి వర్క్ అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం ఈ మగ్గం వర్క్ చేయించుకోవడానికి ఎక్కువగా మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. తమ బ్లౌజులు, చీరలు, గాగ్రా చోళీలపై మగ్గం వర్క్ చేయించుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ప్రస్తుతం ఈ మగ్గం వర్క్ నేర్చుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంది. సాధారణంగా ఈ మగ్గం వర్క్ అనేది నార్త్ ఇండియాకు చెందినటువంటి కళాకారులు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం స్థానికులు కూడా ఈ మగ్గం వర్క్ నేర్చుకొని చక్కటి ఆదాయం పొందుతున్నారు. మహిళలు సైతం ఈ వర్క్ నేర్చుకున్నట్లయితే చక్కటి వ్యాపార అవకాశాలను పొందవచ్చు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే SETWIN సంస్థ ఈ మగ్గం వర్క్ నేర్పిస్తోంది. మూడు నెలల పాటు నేర్పించే ఈ కోర్సులో జర్దోసి వర్క్ గురించి పూర్తి వివరాలను నేర్పించి సర్టిఫికెట్ సైతం అందజేస్తారు. ఈ కోర్సు ఫీజు కూడా కేవలం 2000 రూపాయలు మాత్రమే. ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా మహిళలకు ఈ వర్క్ నేర్పిస్తారు.
కనుక పెద్ద మొత్తంలో భవిష్యత్తులో ఉపాధి పొందే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం జర్దోసి వర్క్ నేర్చుకున్న వారికి మంచి డిమాండ్ ఉందన్న సంగతి గుర్తుంచుకోవాలి. మీరు సొంతంగా కూడా మగ్గం వర్క్స్ చేస్తామని ఆర్డర్లను పొందవచ్చు లేదా ఫ్యాషన్ డిజైనింగ్ బోటిక్స్‌లో పనిచేయడం ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.
మహిళలు ఎక్కువగా ఈ రంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులు వేయడం ద్వారా భవిష్యత్తులో కూడా ఈ రంగంలో పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. మగ్గం వర్క్ చేయడం ద్వారా రోజుకు 5000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉందని ఈ రంగంలో చెబుతున్నారు
Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు టైమ్స్ నౌ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని టైమ్స్ నౌ తెలుగు పాఠకులకు సూచిస్తోంది.
Read more news like this on telugu.timesnownews.com

