Dailyhunt
చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్... దేశ ప్రజలు పోరాడితే, నెతన్యాహు ఒడగొట్టాడు: ఇజ్రాయెల్ నేత సంచలన కామెంట్స్

చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్... దేశ ప్రజలు పోరాడితే, నెతన్యాహు ఒడగొట్టాడు: ఇజ్రాయెల్ నేత సంచలన కామెంట్స్

Times Now Telugu 1 week ago

జ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై ఆ దేశ ప్రధాన ప్రతిపక్ష నేత యైర్ లాపిడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. యుద్ధ లక్ష్యాలను సాధించడంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు విఫలమయ్యారని ఆరోపించారు.

ఇజ్రాయెల్ చరిత్రలోనే ఇంత బిగ్గెస్ట్ డిజాస్టర్ ఎన్నడూ జరగలేదని పేర్కొన్నారు. ఇది రాజకీయ, వ్యూహాత్మక వైఫల్యమని కూడా విమర్శలు గుప్పించారు. వివరాలు... ఇరాన్‌పై ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇరాన్ ప్రతిదాడులకు దిగడంతో యుద్దం ప్రారంభమైంది. అయితే తాజాగా ఇరాన్‌, అమెరికాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇరాన్‌పై తాము ప్లాన్ చేసిన దాడులను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా చెప్పారు.

అయితే ఇరాన్‌తో కాల్పుల విరమణను ఇజ్రాయెల్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యైర్ లాపిడ్ బుధవారం తీవ్రంగా విమర్శించారు. యుద్ధ లక్ష్యాలను సాధించడంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు విఫలమయ్యారని ఆరోపించారు. ''మన చరిత్రలో ఇంతటి రాజకీయ వైఫల్యం ఎన్నడూ జరగలేదు. మన జాతీయ భద్రతకు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి కనీసం చర్చల్లో స్థానం కూడా లభించలేదు. సైన్యం తమకు అప్పగించిన పనులన్నీ పూర్తి చేసింది, ప్రజలు కూడా అద్భుతమైన స్థైర్యాన్ని ప్రదర్శించారు. కానీ నెతన్యాహు రాజకీయంగా, వ్యూహాత్మకంగా విఫలమయ్యారు. ఆయన స్వయంగా నిర్దేశించుకున్న లక్ష్యాలలో దేనినీ సాధించలేకపోయారు'' అని యైర్ లాపిడ్ పేర్కొన్నారు.

అహంకారం, నిర్లక్ష్యం, వ్యూహాత్మక ప్రణాళికా లోపం కారణంగా బెంజమిన్ నెతన్యాహు కలిగించిన రాజకీయ, వ్యూహాత్మక నష్టాన్ని పూడ్చడానికి ఇజ్రాయెల్‌కు అనేక ఏళ్లు పడుతుందని యైర్ లాపిడ్ విమర్శించారు.

ఇక, గతంలో బెంజమిన్ నెతన్యాహు... ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్‌కు అస్తిత్వ ముప్పుగా అభివర్ణించారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించడం లేదా కనీసం తీవ్రంగా బలహీనపరచడాన్ని నెతన్యాహు యుద్ధానికి ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టుగా మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇక, ఇక, ఇరాన్, అమెరికాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశారు. అలాగే, ఇరాన్‌పై తాము ప్లాన్ చేసిన దాడులను నిలిపివేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ చర్యను కాల్పుల విరమణ దిశగా జరుగుతున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా ఆయన అభివర్ణించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, సైన్యాధిపతి అసిమ్ మునీర్‌లతో జరిపిన సంభాషణల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై తాము ప్లాన్ చేసిన దాడులను నిలిపివేయమని వారు తనను కోరారని చెప్పారు.

మరోవైపు హర్మూజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి పరిమిత కాలం పాటు అనుమతి ఇవ్వనున్నట్టుగా ఇరాన్ తెలిపింది. అయితే అది తమ సాయుధ దళాల కఠినమైన సమన్వయంతో మాత్రమే సాధ్యమవుతుందని ఇరాన్ పేర్కొంది. ఇది తమ గొప్ప విజయంగా చెప్పుకుంది.

ఇజ్రాయెల్ ప్రధాని ఏం చెప్పారు?
అమెరికా- ఇరాన్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందించారు. ఇరాన్‌పై బాంబు దాడులను నిలిపివేసే ట్రంప్ నిర్ణయానికి తాము మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అయితే ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని స్పష్టం చేశారు. ఈ మేరకు బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu