Dailyhunt
ChatGPT: సైబర్ నేరాల నుండి యూజర్స్‌ను కాపాడేందుకు, చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్...ఎలా ఆన్ చేసుకోవాలంటే, ప్రాసెస్ ఇదే!

ChatGPT: సైబర్ నేరాల నుండి యూజర్స్‌ను కాపాడేందుకు, చాట్‌జీపీటీలో కొత్త ఫీచర్...ఎలా ఆన్ చేసుకోవాలంటే, ప్రాసెస్ ఇదే!

Times Now Telugu 1 week ago

పెన్ ఏఐకు చెందిన చాట్‌జీపీటీ కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. "అడ్వాన్స్‌డ్ అకౌంట్ సెక్యూరిటీ" పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌ ద్వారా చాట్‌జీపీటీ యూజర్స్, హ్యాకింగ్, ఫిషింగ్ ఎటాక్స్ బారిన పడకుండా కాపాడుతుంది.

దీని ద్వారా అకౌంట్స్ మరింత సురక్షితంగా ఉంటాయి.

"డిజిటల్ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న వారి కోసం, మరింత పటిష్టమైన అకౌంట్ ప్రొటెక్షన్‌ను కోరుకునే ChatGPT అకౌంట్స్ కోసం 'అడ్వాన్స్‌డ్ అకౌంట్ సెక్యూరిటీ' ను ఒక కొత్త ఆప్షనల్ సెట్టింగ్‌గా మేము పరిచయం చేస్తున్నాము," అని OpenAI ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.

"ఈ ఫీచర్, యూజర్స్ అకౌంట్‌ను టేక్ఓవర్ చేయకుండా రక్షించడంలో సహాయపడే పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటుంది. దీనితో పాటు ఆ ప్రొటెక్షన్స్‌ను ఒకే చోట ఈజీగా యాక్టివేట్ చేసుకునే వీలు కల్పిస్తుంది. ఒకసారి ఎన్‌రోల్ చేసుకున్న తర్వాత, అడ్వాన్స్‌డ్ అకౌంట్ సెక్యూరిటీ కోడెక్స్‌లో కూడ యూజర్‌ను ప్రొటెక్ట్ చేస్తుంది. " అని పేర్కొన్నారు.

ఈ అడ్వాన్స్‌ సెక్యూరిటీ ఎలా పనిచేస్తుందంటే....

అడ్వాన్స్ అకౌంట్ సెక్యూరిటీ ద్వారా సైన్-ఇన్ ప్రొటెక్షన్స్, అకౌంట్ రికవర, కాంప్రమైజ్డ్ సెషన్స్‌ నుండి తక్కువ ఎక్స్‌పోజర్, అకౌంట్ యాక్టివిటీలో మరింత విజిబిలిటీని అందిస్తుందని ఓపెన్ ఏఐ తెలిపింది. చాట్‌జీపీటీ యూజర్స్ వెబ్ అకౌంట్‌లో సెక్యూరిటీ సెక్షన్‌కు వెళ్లి ఈ సెట్టింగ్స్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. లాగిన్ ద్వారా చాట్‌జీపీటీ, కోడెక్స్ రెండు అకౌంట్స్‌కు ఈ ప్రొటెక్షన్ లభిస్తుంది.

కంపెనీ ప్రకారం, లాగిన్ సిస్టమ్‌లో కీలక మార్పులు చేశారు. అడ్వాన్స్‌డ్ అకౌంట్ సెక్యూరిటీని ఎనేబుల్ చేసిన తర్వాత, పాస్‌వర్డ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాస్‌వర్డ్‌కు బదులుగా పాస్ కీ లేదా ఫిజికల్ సెక్యూరిటీ కీస్ ఉపయోగించాల్సి ఉంటుంది. వీటికి ఫిషింగ్ ద్వారా ఎలాంటి ప్రమాదం ఉండదు కాబట్టి, వీటిని ఉపయోగించడం సురక్షితం. అకౌంట్ రికవరీ విషయంలో కూడా కీలక మార్పులు చేశారు. గతంలో యూజర్స్ ఇమెయిల్ లేదా ఎస్ఎమ్ఎస్ ద్వారా అకౌంట్స్‌ను రికవరీ చేసుకునే సదుపాయం ఉండేది. ఈ ఆప్షన్‌ను ప్రస్తుతం తొలగించారు. దీనికోసం బ్యాకప్ కీస్, సెక్యూరిటీ కీస్ లేదా రికవరీ కీస్ కావాల్సి ఉంటుంది.


ఒక వేళ ఈ వివరాలు కోల్పోతే సపోర్ట్ టీమ్ కూడా రికవరీ చేయలేదని ఓపెన్ ఏఐ తెలిపింది. కాబట్టి యూజర్స్ ఈ సెట్టింగ్స్ విషయంలో యూజర్స్ జాగ్రత్త వహించాలని సూచించింది. ఈ ఫీచర్ ద్వారా యాక్టివ్ సెషన్స్ ద్వారా కలిగే రిస్క్‌ను తగ్గిస్తుంది. లాగిన్ సెషన్స్ త్వరగా ఎక్స్‌పైరీ అయిపోతాయి. దీనితో పాటు అకౌంట్‌కు సంబంధించిన అన్ని యాక్టివ్ డివైజెస్‌ను మేనేజ్ చేసుకోవచ్చు.

ఈ ఫీచర్ ద్వారా యాక్టివ్ సెషన్స్ ద్వారా కలిగే రిస్క్‌ను తగ్గిస్తుంది. లాగిన్ సెషన్స్ త్వరగా ఎక్స్‌పైరీ అయిపోతాయి. దీనితో పాటు అకౌంట్‌కు సంబంధించిన అన్ని యాక్టివ్ డివైజెస్‌ను మేనేజ్ చేసుకోవచ్చు.

దీనితో పాటు ఈ ఫీచర్‌లో ప్రైవసీని కూడా మెరుగుపర్చారు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా మీ చాట్స్ ఏఐ మోడల్స్ కోసం ఉపయోగించబడవు. సెన్సిటివ్ ఇన్‌ఫర్మేషన్ విషయంలో ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఓపెన్ ఏఐ Yubico భాగస్వామ్యంతో YubiKey వంటి హార్డ్‌వేర్ కీస్‌ను అందిస్తుంది.

ఎలా ఎన్‌రోల్ చేసుకోవాలి?

  • వెబ్‌లో చాట్‌జీపీటీ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి
  • సెక్యూరిటీ సెక్షన్‌కు వెళ్లండి
  • పాస్‌కీస్ లేదా సెక్యూరిటీ కీ ను సెటప్ చేసుకోండి.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu