Dailyhunt
డయాబెటిస్‌తో బాధపడేవారు స్వీట్ కార్న్ తినడం మంచిదేనా? లాభాలేంటి, నష్టాలేంటి ?

డయాబెటిస్‌తో బాధపడేవారు స్వీట్ కార్న్ తినడం మంచిదేనా? లాభాలేంటి, నష్టాలేంటి ?

Times Now Telugu 5 days ago

స్వీట్ కార్న్‌ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. ఇందులో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే డయాబెటిస్‌తో బాధపడే వారు స్వీట్ కార్న్ తినడం మంచిదేనా?

రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం ఉంటుందా? అనే విషయం తెలుసుకుందాం!

స్వీట్ కార్న్‌లో నేచురల్ షుగర్స్, కార్బోహైడ్రేట్స్ కంటెంట్ సమృద్దిగా ఉంటుంది. అయితే వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం ఉంటుంది.

డయాబెటిస్‌లో కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకునే వారు స్వీట్ కార్న్ వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై ప్రభావం ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. స్వీట్ కార్న్‌ను మితంగా తీసుకోవడం,ఇతర ఆహార పదార్థాలతో కలిపి డయాబెటిస్ పేషెంట్స్ తీసుకోవచ్చు.

స్వీట్ కార్న్ తినడం వలన కలిగే లాభాలేంటి?
స్వీట్ కార్న్ తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలపై పాజిటివ్, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనిని ఎంత మోతాదులో తీసుకుంటున్నారు? ఎలా తీసుకొంటున్నారనే విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది.

స్వీట్ కార్న్‌తో లభాలివే....
స్వీట్ కార్న్‌లో డైటరీ ఫైబర్, గ్లైసిమిగ్ ఇండెక్స్(GI) తక్కువ నుండి సాధారణ స్థాయిలో ఉంటుంది. దీని వలన షుగర్ రక్త ప్రవాహంలోకి సులభంగా కలిసిపోతుంది, దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

స్వీట్ కార్న్‌లో డైటరీ ఫైబర్ ఉంటుంది. దీని వలన జీర్ణశక్తి పెరుగుతుంది, రక్తంలో చక్కెర్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. స్వీట్ కార్న్‌లో గ్లైసిమిక్ ఇండెక్స్ సుమారుగా 52 నుండి 55 వరకు ఉంటుంది.దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. స్వీట్‌కార్న్‌లో విటమిన్ ఎ, బి, సి తో పాటు పొటాషియం, మెగ్నీషియం ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. దీని వలన ఇన్సులిన్ సెన్సిటివటీ మెరుగవుతుంది.

స్వీట్ కార్న్‌లో లూటిన్, జియాక్సాంథిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.దీని వలన డయాబెటిస్ సమస్య తగ్గుతుంది, కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.

స్వీట్ కార్న్‌తో కలిగే నష్టాలివే!

స్వీట్‌కార్న్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఇతర ఫుడ్‌తో తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవచ్చు. స్వీట్ కార్న్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వలన రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం ఉంటుంది. సాధారణ స్థాయిలో తీసుకోవడం వల డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. క్యాన్డ్ కార్న్, కార్న్ ప్రొడక్ట్స్‌లో అదనపు చక్కెరలు, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలపై ఎక్కుగా ప్రభావం ఉంటుంది.
Disclaimer:
పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే....పాటించేముందు సంబంధిత నిపుణుల సలహా పాటించడం తప్పనిసరి!

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu