Dailyhunt
'డెకాయిట్'కి పోటీగా థియేటర్లలోకి 'డైమండ్ డెకాయిట్'! వాట్ ఏ మాస్టర్ ప్లాన్ భయ్యా...

'డెకాయిట్'కి పోటీగా థియేటర్లలోకి 'డైమండ్ డెకాయిట్'! వాట్ ఏ మాస్టర్ ప్లాన్ భయ్యా...

Times Now Telugu 1 week ago

డివి శేష్ నటించిన 'డెకాయిట్' మూవీ, ఏప్రిల్ 10న విడుదల అవుతోంది. ఇదే మూవీకి పోటీగా 'డైమండ్ డెకాయిట్' మూవీ కూడా థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

సూర్య జి. యాదవ్ దర్శకత్వంలో పార్ధ గోపాల్, మేఘన జంటగా తెరకెక్కిన మూవీ 'డైమండ్ డెకాయిట్'. హీరో పార్ధ గోపాల్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ మూవీని కూడా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'డైమండ్ డెకాయిట్' మూవీ ట్రైలర్‌ని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, నిర్మాత 'దిల్' రాజు రిలీజ్ చేశారు.

'డైమండ్ డెకాయిట్ మూవీ ట్రైలర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు కథలో మంచి థ్రిల్‌ని చూపించారు. ఈ మూవీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుందని నమ్ముతున్నా...' అంటూ నిర్మాత శిరీష్ రెడ్డి, చిత్ర యూనిట్‌ని అభినందించారు.

'ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, నిర్మాత దిల్ రాజు మా 'డైమండ్ డెకాయిట్' మూవీ ట్రైలర్‌ని ఆవిష్కరించడం, బాగుందని అభినందించడం చాలా సంతోషంగా ఉంది. ఇది రొటీన్ స్టోరీ కాదు. సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్ ఇస్తుంది, ఎమోషన్స్ కూడా ఉంటాయి. అన్నీ కలిసిన కంప్లీట్ ఎంటర్‌టైనర్. కచ్ఛితంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుంది. ' అంటూ హీరో, నిర్మాత పార్ధ గోపాల్ అన్నాడు.

డైరెక్టర్ సూర్య జి యాదవ్ మాట్లాడుతూ 'అయ్యన్న పాత్రుడు గారు, దిల్ రాజు, సినీ ప్రముఖులు మా సినిమా ట్రైలర్ చూసి అభినందించడం మా మూడేళ్ల కృషికి ఫలితం దక్కిందనిపిస్తుంది. చాలా కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాని తెరకెక్కించాం. ప్రతీ సీన్, ప్రతీ ఫ్రేమ్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. టికెట్‌కి పెట్టిన ప్రతీ రూపాయికి తగ్గ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాం..' అంటూ ధీమా వ్యక్తం చేశాడు.

'డైమండ్ డెకాయిట్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాతలు వాకడ అప్పారవు, శిరీష్ రెడ్డితో పాటు థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్, శివాజీ రాజా పాల్గొన్నారు.


  • మొదటి రోజు మహిళలకు ఫ్రీ టికెట్..

ఇంతకుముందు 'హుక్ స్టెప్ వేయండి, రూ.1 లక్ష గెలవండి' అంటూ వినూత్న పబ్లిసిటీతో మంచి అటెన్షన్ దక్కించుకుంది 'డైమండ్ డెకాయిట్' మూవీ. ఇప్పుడు రిలీజ్ రోజు 4 ఆటలు కూడా మహిళలకు ఉచితంగా టికెట్లు ఇవ్వబోతున్నట్టుగా రిలీజ్ పోస్టర్ ద్వారా ప్రకటించింది 'డైమండ్ డెకాయిట్' మూవీ యూనిట్.

  • 'డెకాయిట్'కి పోటీగా..

అడివి శేష్ 'డెకాయిట్' మూవీ కూడా ఏప్రిల్ 10నే థియేటర్లలోకి వస్తోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన 'డెకాయిట్' మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. 'డైమండ్ డెకాయిట్' మూవీ టైటిల్ కూడా 'డెకాయిట్'కి దగ్గరగా ఉండడంతో ప్రేక్షకులు కంఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో 'కల్కి 2898ad' రిలీజ్ రోజున రాజశేఖర్ నటించిన 'కల్కి' మూవీ రీ-రిలీజ్ అయ్యి థియేటర్లలోకి వచ్చింది. దీంతో రాజశేఖర్'కల్కి' మూవీకి భారీగా బుకింగ్స్ జరిగాయి. ఇప్పుడు 'డైమండ్ డెకాయిట్' మూవీకి కూడా అలాంటి అడ్వాంటేజ్ ఉంది. అయితే థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులకు నూరు శాతం ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తామని గ్యారెంటీ ఇస్తోంది 'డైమండ్ డెకాయిట్' చిత్ర యూనిట్.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu