Dailyhunt
డేవిడ్ మిల్లర్‌కి అవమానం.. బ్యాటింగ్‌కి వెళ్తుంటే ఆపిన కోచ్ హేమాంగ్ బదానీ.. అదే మ్యాచ్‌ని మలుపు తిప్పిందా?

డేవిడ్ మిల్లర్‌కి అవమానం.. బ్యాటింగ్‌కి వెళ్తుంటే ఆపిన కోచ్ హేమాంగ్ బదానీ.. అదే మ్యాచ్‌ని మలుపు తిప్పిందా?

Times Now Telugu 1 week ago

పీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ బోణీ కొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్.

ఈ మ్యాచ్‌లో యంగ్ బ్యాటర్ సమీర్ రిజ్వీ 47 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచాడు. అయితే ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్‌కి అవమానం జరిగిందని తెగ ఫీలైపోతున్నారు అతని అభిమానులు.

  • ఇంతకీ ఏం జరిగింది?

142 పరుగుల లక్ష్యఛేదనలో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కి మొదటి ఓవర్ మొదటి బంతికే షాక్ తగిలింది. కెఎల్ రాహుల్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి.. బౌండరీ లైన్ దగ్గర ఎదురుచూస్తున్న మోహ్సిన్ ఖాన్ చేతుల్లోకి బంతిని కొట్టాడు. నితీశ్ రాణా 15 పరుగులకి అవుట్ కాగా పథుమ్ నిశ్శంకని అవుట్ చేసిన ప్రిన్స్ యాదవ్, ఆ తర్వాతి బంతికి అక్షర్ పటేల్‌ని క్లీన్ బౌల్డ్ చేశాడు..

4 వికెట్లు పడగానే బ్యాటింగ్‌కి వెళ్లేందుకు సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ రెడీ అయ్యాడు. అయితే అతను బ్యాటు తీసుకుని, గ్రౌండ్‌లోకి అడుగుపెట్టేందుకు బయలుదేరుతుండగా.. ఉరుకులు పరుగుల మీద వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ... అతన్ని క్రీజులోకి వెళ్లకుండా ఆపాడు. అతన్ని కాకుండా మరో సౌతాఫ్రికా బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్‌ని బ్యాటింగ్‌కి పంపాడు.

  • మ్యాచ్ టర్నింగ్ పాయింట్...

26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్, సమీర్ రిజ్వీతో కలిసి అత్యంత కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 76 బంతుల్లో 119 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పి, ఢిల్లీ క్యాపిటల్స్‌కి విజయాన్ని అందించాడు. సాధారణంగా దూకుడుగా ఆడే ట్రిస్టన్ స్టబ్స్, మరో ఎండ్‌లో సమీర్ రిజ్వీ.. దూకుడుగా ఆడడంతో స్ట్రైయిక్ రొటేట్ చేయడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు.

32 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన ట్రిస్టన్ స్టబ్స్‌, ఆఖరి విన్నింగ్ షాట్ కొట్టే ఛాన్స్ కూడా సమీర్ రిజ్వీకే వదిలేశాడు.

  • రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్‌ని కాదని...

సాధారణంగా క్రీజులో ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాటర్లు ఉంటే.. ఫీల్డింగ్ టీమ్‌కి ఫీల్డ్ సెట్టింగ్, బౌలింగ్ మార్పులు చాలా ఈజీ అయిపోతుంది. అందుకే లెఫ్ట్ హ్యాండ్ - రైట్ హ్యాండ్ కాంబినేషన్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌ని సెట్ చేయడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. దీని వల్ల బ్యాటర్ స్ట్రైయిక్ రొటేట్ చేసిన ప్రతీసారీ, ప్రత్యర్థి జట్టు ఫీల్డింగ్ మార్చాల్సి ఉంటుంది. అయితే హేమాంగ్ బదానీ మాత్రం లెఫ్ట్ హ్యాండ్ - రైట్ హ్యాండ్ కాంబినేషన్ కంటే ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ ట్రిస్టన్ స్టబ్స్‌ని పంపి.. సీనియర్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్‌ని మరో వికెట్ పడితే పంపొచ్చని ఆలోచించాడు. ఇదే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

2012 నుంచి క్రమం తప్పకుండా ఐపీఎల్ ఆడుతున్న డేవిడ్ మిల్లర్, 142 మ్యాచుల్లో 3077 పరుగులు చేశాడు. ఇందులో 13 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu