Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిజిటల్  మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీ కీలక నిర్ణయం...డెబిట్ ట్రాన్సాక్షన్స్‌కు 'కిల్ స్విచ్' ఎలా పనిచేస్తుందంటే?

డిజిటల్ మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీ కీలక నిర్ణయం...డెబిట్ ట్రాన్సాక్షన్స్‌కు 'కిల్ స్విచ్' ఎలా పనిచేస్తుందంటే?

Times Now Telugu 6 days ago

డిజిటల్ లావాదేవీలు గత కొన్నేళ్లుగా దేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి. దీనితో పాటు డిజిటల్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కీలక నిర్ణయం తీసుకుంది.

డిజిట్ల్ మోసాలను అరికట్టేందుకు ఆర్‌బీఐ కిల్ స్విచ్ వంటి ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో కిల్ స్విచ్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుందనే విషయం తెలుసుకుందాం!

డిజిటల్ పేమెంట్స్ విషంలో భద్రత కల్పించేందుకు భద్రతా ప్రమాణాలు-మోసాల నియంత్రణ పేరిట సమగ్ర ముసాయిదా చర్చా పత్రాన్ని ఆర్‌బీఐ ఇటీవల విడుదల చేసింది.

అసలేంటి కిల్ స్విచ్ విధానం ?
బ్యాంకు లావాదేవీల విషయంలో ఖాతాదారుడికి ఏమైనా అనుమానం కలిగితే అతడి డిజిటల్ లావాదేవీలను నిలిపివేసేలా ఒక క్విల్ స్విచ్ ఆప్షన్‌ను కూడా బ్యాంకులు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సన్నాహాలు చేస్తోంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిన కిల్ స్విచ్ ప్రతిపాదన ద్వారా అనుమానాస్పద లావాదేవీలు జరిగిన సందర్భంలో యూపీఐ, ఆన్‌లైన్ బ్యాంకింగ్, కార్డు లావాదేవీలను నిలిపివేయవచ్చు. దీనితో పాటు 70 ఏళ్లు పైబడిన వినియోగదారుల కోసం, అలాగే దివ్యాంగుల కోసం 'ట్రస్టెడ్ పర్సన్' అప్రూవల్ మెకానిజంను కూడా ప్రవేశపెట్టాలని కూడా సూచిస్తుంది. దీని ద్వారా రూ.50 వేలకు మించిన ట్రాన్స్‌ఫర్స్ కోసం, ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేసేందుకు ముందుగా నిర్మయించుకున్న 'ట్రస్టెడ్ పర్సన్' నుండి నిర్ధారణ అవసరం ఉంటుంది.

డిజిటల్ ట్రాన్సాక్షన్స్ విషయంలో అనుమానం కలిగినట్లయితే , సంభావ్య డిజిటల్ మోసాన్ని నివారించడానికి అన్ని డెబిట్ లావాదేవీల కోసం 'కిల్ స్విచ్'ను ప్రవేశపెట్టే అవకాశాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిశీలిస్తోందని, మే 29న ప్రచురించిన తన వార్షిక నివేదికలో ఆ నియంత్రణ సంస్థ తెలిపింది.

" అన్ని డిజిటల్ పేమెంట్స్ విధానాల కోసం స్విచ్-ఆన్ , స్విచ్-ఆఫ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టడంతో పాటు, అకౌంట్ ద్వారా జరిగే అన్ని డెబిట్‌లను ఒకేసారి నిరోధించడానికి 'కిల్ స్విచ్'ను కూడా పరిశీలిస్తాము. ఇది వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి , డిజిటల్ చెల్లింపు లావాదేవీలలో మోసాన్ని నియంత్రించడానికి దోహదపడుతుంది," అని ఆర్‌బిఐ తెలిపింది.

కిల్ స్విచ్ సదుపాయం బ్యాంకు వెబ్‌సైట్స్ లేదా యాప్స్ ద్వారా జరిగే డొమెస్టిక్, ఇంటర్నేషనల్, ట్యాప్ అండ్ పే కార్డు పేమెంట్ ట్రాన్సాక్షన్స్‌కు అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా కస్టమర్స్‌కు డిజిటల్ పేమెంట్ యూసేజ్‌పై మరింత కంట్రోల్ లభించనుంది.

డిజిటల్ పేమెంట్స్ రిస్క్‌ను తెలిపే ఏఐ స్కోర్
సెంట్రల్ బ్యాంకు ఈ ఏడాది డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (DPIP)ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్, భారతదేశంలోని ప్రతి డిజిటల్ ట్రాన్సాక్షన్‌కు రియల్-టైమ్ రిస్క్ స్కోర్‌ను కేటాయించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగిస్తుంది. దీని ద్వారా డిజిటల్ పేమెంట్స్ చేసే ముందు అవి ఎంత సురక్షితమైననే విషయం తెలుసుకోవచ్చు.

స్పీడ్, సౌలభ్యం కారణంగా 52 శాతం మంది వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్‌ను ఎంచుకుంటారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చేపట్టిన సర్వేలో తేలింది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu