Dailyhunt
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 'నార్కో టెస్ట్' వ్యాఖ్యలపై 'మా' రియాక్షన్! తీవ్రంగా ఖండించిన వైస్ ప్రెసిడెంట్...

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి 'నార్కో టెస్ట్' వ్యాఖ్యలపై 'మా' రియాక్షన్! తీవ్రంగా ఖండించిన వైస్ ప్రెసిడెంట్...

Times Now Telugu 2 weeks ago

సినిమా రిలీజ్‌కి ముందు హీరోలకు'డ్రగ్ టెస్టు' నిర్వహించాలని తెలంగాణ ఎమ్మెల్యే జె. అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, తీవ్ర వివాదాస్పదమయ్యాయి. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ప్రెసిడెంట్, నటుడు మంచు విష్ణు తెలంగాణ ఎమ్మెల్యే జె.

అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు.

'నటీనటులకు నార్కో టెస్టు చేయాలనే మీ ఆలోచన మంచిదే. అయితే ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ముందు మీ నాయకులకు సరిపోయే టెస్టు ఏం ఉంటుందా అని ఆలోచిస్తున్నా. గౌరవనీయులైన ఎమ్మెల్యే ఇలాంటి ఓ ఉమ్మడి నిబంధనలు తీసుకువస్తే, ఓటర్లు సంతోషిస్తారు..' అంటూ ట్వీట్ చేశాడు 'మా' ప్రెసిడెంట్ మంచు విష్ణు.

తాజాగా 'మా' వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ఈ విషయంపై మాట్లాడాడు. 'తెలుగు చలనచిత్ర పరిశ్రమ క్రమశిక్షణతో నిండుకున్న పరిశ్రమ. ఇలా ఆధారం లేకుండా తెలుగు ఇండస్ట్రీపై అసహ్యకరమైన వ్యాఖ్యలు తీవ్ర బాధాకరం. తెలుగు చలన చిత్ర నటులు, టెక్నీషియన్లు సమాజ అభివృద్దిలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు.

  • పట్టభద్రులు ఎందరో..

టాలీవుడ్‌లో ఎంతో మంది నటీనటులు డిగ్రీలు, పీజీలు, డాక్టరేట్లు చేసిన వాళ్లు ఉన్నారు. ఉన్నత చదువులు చదివి, నటనపై ఇండస్ట్రీకి వచ్చినవాళ్లు ఎందరో ఉన్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాలు దక్కించుకున్న మహానీయులు కూడా తెలుగు చలన చిత్రపరిశ్రమలో ఉన్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరావు, సూపర్ స్టార్ కృష్ట, రెబల్ స్టార్ కృష్ణంరాజు, చిరంజీవి, ఆర్.నారాయణ మూర్తి, మాదాల రంగారావు వంటి దిగ్గజాలు.. తమ సినిమాల ద్వారా సమాజంలో చైతన్యం తీసుకొచ్చారు. శక్తివంతమైన సందేశాలతో జనాల్లో మార్పు తీసుకొచ్చే సందేశాలు అందించారు. ప్రస్తుత తరంలో ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి నటులు.. తమ నటనతో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు, అవార్డులు అందుకున్నారు.

  • డ్రగ్స్ నిర్మూలనలో వెనకడుగు వేయం...

మాదక ద్రవ్యాల నిర్మూలనలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కానీ, తెలుగు చలన చిత్రపరిశ్రమ కూడా ఎప్పుడూ ముందుంటుంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరీతో కలిసి ఎంతో సన్నిహితంగా పని చేస్తోంది. చిరంజీవి, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు, యువతను డ్రగ్స్‌కి దూరంగా ఉండమని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. .

సామాజిక బాధ్యతని తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడూ విస్మరించలేదు. డ్రగ్స్‌ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే వరకూ టాలీవుడ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పోరాటం కూడా కొనసాగుతూనే ఉంటుంది.. ' అంటూ చెప్పుకొచ్చాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాదాల రవి.

సినిమా రిలీజ్‌లకి ముందు హీరోలకు డ్రగ్స్ చేయించాలని చెప్పిన జడ్చెర్ల నియోజిక వర్గ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, కొంతకాలం క్రితం టీటీడీ బోర్డుపై వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఇచ్చిన రికమెండేషన్లను తిరుమల తిరుపతి దేవస్థానం పట్టించుకోకపోవడంపై తీవ్రంగా రియాక్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, హైడ్రాపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu