Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గన్‌మెన్ల తొలగింపు వెనుక రాజకీయ కుట్రలు...: వైసీపీ నేత తోపుదుర్తి

గన్‌మెన్ల తొలగింపు వెనుక రాజకీయ కుట్రలు...: వైసీపీ నేత తోపుదుర్తి

Times Now Telugu 2 days ago

పీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తన గన్‌మెన్లను కావాలనే తొలగించిందని ఆరోపించారు.

పదేళ్లుగా భద్రతా సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఒక్కసారిగా గన్‌మెన్లను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. ఇలా గన్‌మెన్లను తొలగించడం వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత అవినీతి, దౌర్జన్యాలపై తాను నిరంతరం ప్రశ్నిస్తున్నందుకే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై గళమెత్తే నాయకులను భయపెట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను అణగదొక్కడం సరికాదని, రాజకీయ కక్షలతో భద్రతను తొలగించడం దుర్మార్గ చర్య అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.

ఇదిలాఉంటే, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైసీపీ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి గత రెండేళ్లుగా 1 ప్లస్ 1 గన్‌మెన్ భద్రత కొనసాగుతుండగా... ఇప్పుడు ఆ భద్రతను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని అన్నారు. ప్రభుత్వం రాజకీయ కక్షతోనే ఈ నిర్ణయం తీసుకుందని వైసీపీ నేతలు విమర్శించారు. ప్రజల్లో బలమైన ఆదరణ కలిగిన నాయకులను లక్ష్యంగా చేసుకుని భద్రతా సౌకర్యాలను తగ్గించడం సరైన విధానం కాదన్నారు. రాజకీయ విభేదాల పేరుతో వ్యక్తిగత భద్రత అంశంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వివాదాస్పదమైన నియోజకవర్గాల్లో రాప్తాడు ఒకటి అని... అత్యంత సున్నిత సమస్యాత్మక నియోజకవర్గంగా ఉందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక్కడ రాజకీయ ఫ్యాక్షన్ అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్న సంగతి దేశ మొత్తంగా తెలుసునని... రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారికి ఈ విషయంపై మరింత అవగాహన ఉంటుందని అన్నారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి గన్ మెన్‌ను ఉపసంహరించడం పార్టీ శ్రేణులను కలవరింపుకు గురిచేస్తుందని పేర్కొన్నారు.

తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి గతంలో ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. రాజకీయ వేధింపులకు పాల్పడకుండా ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu