Dailyhunt
Gold ETF: బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే గోల్డ్ ఈటీఎఫ్ ప్లాన్ గురించి A to Z ఇప్పుడే తెలుసుకోండి...

Gold ETF: బంగారంలో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే గోల్డ్ ఈటీఎఫ్ ప్లాన్ గురించి A to Z ఇప్పుడే తెలుసుకోండి...

Times Now Telugu 5 days ago

బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా గోల్డ్ ఈటీఎఫ్ స్కీముల్లో పెట్టుబడి పెట్టేందుకు చాలామంది ఆసక్తి చూపించడం చూడవచ్చు.

ఎందుకంటే గడచిన సంవత్సర కాలంగా గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 70% రిటర్న్ అందించింది. ఈ నేపథ్యంలో గోల్డ్‌ను ఫిజికల్‌గా కొనుగోలు చేసే కన్నా కూడా గోల్డ్ ఈటీఎఫ్ (ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లో పెట్టుబడి పెట్టినట్లయితే చక్కటి లాభాలను పొందే అవకాశం ఉందని, పెట్టుబడికి ఇది సరైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో పలు బ్రోకరేజ్ సంస్థలు ఈ గోల్డ్ ఈటీఎఫ్ స్కీములను నిర్వహిస్తున్నాయి. స్టాక్ మార్కెట్ తరహాలోనే బంగారంలో కూడా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు.

ముఖ్యంగా ఈ గోల్డ్ ఈటీఎఫ్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ప్రధానంగా గోల్డ్ స్వచ్ఛత విషయంలో ఎలాంటి భయం ఉండదు. ఎందుకంటే ఇది ఫిజికల్ గోల్డ్ కాదు కానీ 99.5 శాతం స్వచ్ఛత కలిగిన ఫిజికల్ గోల్డ్‌కు సమానమైన విలువను ఈ గోల్డ్ బాండ్స్‌కు అందిస్తారు. అంతేకాదు, ఫిజికల్ గోల్డ్ దాచుకోవాలంటే బ్యాంకు లాకర్ అవసరం అవుతుంది. కానీ వీటికి అలాంటి అవసరం లేదు. దాంతో లాకర్ ఖర్చులు ఉండవు. మీ డీమాట్ ఖాతాలోనే డిజిటల్ రూపంలో ఈ గోల్డ్ యూనిట్స్‌ను జమ చేస్తారు.

స్టాక్ మార్కెట్ పని వేళల్లో మీరు ఎప్పుడైనా వీటిని అమ్మి నగదుగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఫిజికల్ గోల్డ్ తరహాలో వీటిపై ఎలాంటి మేకింగ్ చార్జీలు, వేస్టేజ్ చార్జీలు ఉండవు. మార్కెట్లో బంగారం కదలికలను బట్టి ఈటీఎఫ్ యూనిట్ల విలువ పెరుగుతుంది లేదా తగ్గుతుంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న గోల్డ్ ఈటీఎఫ్ స్కీములు ఇవే:
Nippon India ETF Gold BeES
Kotak Gold ETF
UTI Gold ETF
Axis Gold ETF
Invesco India Gold ETF
Aditya Birla Sun Life Gold ETF
Quantum Gold Fund
HDFC Gold ETF
SBI Gold ETF
ICICI Prudential Gold ETF

తరచుగా అడిగే ప్రశ్నలు: FAQs

ప్రశ్న: Gold ETF Scheme అంటే ఏంటి
జవాబు: వీటిని గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని పిలుస్తారు. ఇది ఫిజికల్ గోల్డ్ కాదు స్టాక్ మార్కెట్లో షేర్ల తరహాలో యూనిట్స్ రూపంలో ఉంటాయి. వీటి విలువను 99.5 శాతం ప్యూరిటీ కలిగిన బంగారం విలువతో పోల్చి ట్రేడ్ చేస్తారు. బంగారం ధరల కదలిక ఆధారంగా వీటి విలువ తగ్గడం పెరగడం జరుగుతుంది.

ప్రశ్న: గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లను ఎక్కడ భద్ర పరుస్తారు
జవాబు: గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లను సాధారణంగా డీమాట్ అకౌంట్లో భద్రపరుస్తారు

Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు టైమ్స్ నౌ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని టైమ్స్ నౌ తెలుగు పాఠకులకు సూచిస్తోంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu