నేడు మే 4వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,041 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.
1,39,472 పలుకుతోంది. 18 క్యారెట్ పది గ్రాముల బంగారం ధర రూ. 1,14,113 పలుకుతోంది. పసిడి ధరలు గడచిన కొన్ని రోజులుగా గమనించినట్లయితే తగ్గుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ పెరగడమే, ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో డాలర్ విలువ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రపంచ దేశాలన్నీ కూడా క్రూడ్ ఆయిల్ ను డాలర్ మారకంలోనే కొనుగోలు చేస్తుంటాయి. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధర భారీగా పెరిగిన నేపథ్యంలో అనేక దేశాలు తమ విదేశీ మారక ద్రవ్యం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా డాలర్ కు డిమాండ్ పెరిగింది.
ఇదిలా ఉంటే సాధారణంగా డాలర్ విలువ పెరిగినప్పుడు బంగారం ధర తగ్గుతుంది అని నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే డాలర్ విలువ పెరిగినప్పుడు అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల పై వచ్చే రాబడి కూడా పెరుగుతుంది. బంగారం వంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల నుంచి బయటకు తీసి అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెడుతుంటారు. ఫలితంగా బంగారం ధర తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. బంగారం డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలోనే ధరలు తగ్గుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉంటే బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేవారికి మాత్రం ఊరట కలుగుతోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా పసిడి ఆభరణాలు గడచిన సంవత్సర కాలంగా గమనించినట్లయితే పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో సామాన్యులు కొనడం తగ్గించేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు సామాన్యులు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్న నేపథ్యంలో మళ్లీ బంగారం దుకాణాలకు వచ్చేందుకు పసిడి ప్రియులు ఆసక్తి చూపే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు పెళ్లిల సీజన్ కూడా ప్రారంభం అయిన నేపథ్యంలో బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు పసిడి ప్రియులు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే భవిష్యత్తులో బంగారం ధర పెరుగుతుందా లేక తగ్గుతుందా అనే సందేహం చాలా మందికి కలగవచ్చు. అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి పరిస్థితుల రీత్యా చూసినట్లయితే అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి.
Disclaimer: పై కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా పరిగణించరాదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, వెండి వంటి విలువైన లోహాలు అన్ని పెట్టుబడి సాధనాలు లాభనష్టాలకు లోనవుతాయి. మీరు చేసే వ్యాపారాలు లేదా పెట్టుబడుల వల్ల కలిగే లాభనష్టాలకు టైమ్స్ నౌ తెలుగు ఎలాంటి బాధ్యత వహించదు. పెట్టుబడి లేదా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు, మీ సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని టైమ్స్ నౌ తెలుగు పాఠకులకు సూచిస్తోంది.
Read more news like this on telugu.timesnownews.com

