హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీటెక్ విద్యార్థినిపై ఆమె క్లాస్‌మేట్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి... యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌కు చెందిన ఉడుతల విజయ్ ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రస్తుతం అతడు ఇబ్రహీంపట్నంలోనే ఓ గదిలో అద్దెకు ఉంటున్నాడు. అతడికి తనతో పాటు చదువుతున్న ఓ యువతితో పరిచయం ఉంది. అతడు మే 14న ఆమెను తీసుకుని కారులో టీ తాగేందుకు దిల్‌సుఖ్‌నగర్‌కు వచ్చాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో కాసేపు గడిపిన అనంతరం తిరిగి ఇబ్రహీంపట్నం బయలుదేరారు.
అయితే తిరిగి వెళ్లే సమయంలో విజయ్ మద్యం కొనుగోలు చేశాడు. ఆ తర్వాత బీడీఎస్ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి కారును పోనిచ్చాడు. అక్కడ విజయ్ మద్యం తాగాడు. ఆ యువతితో కూడా బలవంతంగా మద్యం తాగిపించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ యువతి మత్తులో ఉండిపోయింది. అనంతరం విజయ్ కారులో యువతిని ఇబ్రహీంపట్నంలోని తన గది వద్దకు తీసుకెళ్లాడు. ఆ యువతిని గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
అయితే మద్యం మత్తు దిగిన తర్వాత యువతి తనపై అత్యాచారం జరిగినట్టుగా గుర్తించింది. ఈ క్రమంలోనే మే 17వ తేదీన పోలీసులను ఆశ్రయించింది. తనపై విజయ్ అత్యాచారానికి పాల్పడినట్టుగా ఆరోపిస్తూ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు బీఎన్‌ఎస్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు విజయ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Read more news like this on telugu.timesnownews.com

