Dailyhunt
హర్మూజ్‌ జలసంధిని తెరవండి, లేదంటే పర్యవసానాలు తప్పవు: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

హర్మూజ్‌ జలసంధిని తెరవండి, లేదంటే పర్యవసానాలు తప్పవు: ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Times Now Telugu 3 weeks ago

ర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్ దేశానికి ట్రంప్‌ హెచ్చరికలు జారీచేసారు. లేదంటే ఇరాన్‌పై తీవ్రమైన దాడలు చేస్తామని, దీని వలన తీవ్ర పర్యవసానాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.

ట్రూత్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన ట్రంప్, ఇరాన్‌పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని టెహ్రాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గడువు విధించారు. ఆ గడువు ఏప్రిల్ 6తో ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ సహా, ఆ దేశంలోని పలువురు కీలక నాయకులు, కుటుంబ సభ్యులను హతమార్చేందుకు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా 30కి పైగా ఆయుధాలతో దాడి చేశాయి. ఫిబ్రవరినెలలో ఈ యుద్ధం ప్రారంభమంది. దీంతో ఇరాన్ ప్రపంచ వాణిజ్యంలో ఎంతో కీలకమైన సముద్ర వాణిజ్య మార్గమైన హర్మూజ్‌ను ఇరాన్ మూసివేసింది.

టెహ్రాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా బలగాలకు తమ భూభాగాలను స్థావరాలుగా వాడుకోవడానికి గల్ఫ్ దేశాలు అనుమతించాయి. దీంతో గల్ఫ్ దేశాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో ఈ ఘర్షణ మరింత తీవ్రమైంది.

హర్మూజ్ జలసంధి తెరవాలంటూ విధించిన గడువు సమీపిస్తుండటంతో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. మంగళవారం రోజు విద్యుత్ ప్లాంట్లు, వంతెనలను లక్ష్యంగా చేసుకుని తీవ్రంగా దాడిచేస్తామని హెచ్చరించారు. మీరు నరకాన్ని చూస్తారంటూ తీవ్రమైన పదజాలంతో మండిపడ్డారు.

ఇరాన్‌తో యుద్దంలో అమెరికాకు చెందిన " F-15E స్ట్రైక్ ఈగల్" యుద్ధ విమానం కూలిపోయిన ఘటనలో తప్పిపోయిన రెండో పైలట్ కోసం అమెరికా ప్రత్యేక ఆపరేషన్‌ను నిర్వహించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న దాడుల్లో భాగంగా 2026 ఏప్రిల్ 3న ఈ ఘటన జరిగింది. తప్పిపోయిన పైలట్ల కోసం అమెరికా రెండు హెలికాప్టర్లతో ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టింది.

ఆదివారం రోజున తప్పిపోయిన పైలట్‌ కోసం అమెరికా చేసిన ఆపరేషన్ విజయవంతమైంది. రెండో పైలట్‌ను అమెరికా బలగాలు సురక్షితంగా కాపాడాయి.

ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్‌ల మధ్య యుద్దంతో మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్‌ను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థలు కూడా అమెరికాకు చెందిన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది.

ఇరాన్‌లోని యురేనియంపై ట్రంప్ టార్గెట్ !
ఇరాన్ దేశం వద్ద ఉన్న 450 కిలోల యురేనియం స్వాధీనం చేసుకునేందుకు అమెరికా దృష్టిపెట్టినట్లు పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఇరాన్ వద్ద ఉన్న 60 శాతం శుద్ది చేసిన యురేనియం నిల్వలను ట్రంప్ టార్గెట్ చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో పేర్కొంది. ఇరాన్ వద్ద అణ్వాయుధ తయారీకి అవసరమైన శుద్దిచేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. దీంతో అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది, ఇరాన్‌ ఆ యురేనియాన్ని అప్పగించాని ఒత్తిడి చేస్తుంది. యుద్దం ముగించేందుకు చేసే చర్చల్లో భాగంగా ఈ అంశాన్ని చేర్చే ప్రయత్నంలో అమెరికా ఉందని సమాచారం.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu