హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక నగర జీవనశైలికి సరిపోయే విధంగా రూపొందించారు . ఇది పర్యావరణహితమైన రవాణా అందించడం తోపాటు వినియోగదారులకు సౌకర్యవంతమైన , స్మార్ట్ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
పవర్ఫుల్ లిథియమ్-అయాన్ బ్యాటరీ, లాంగ్ టైం పెర్ఫార్మన్స్ , వేగవంతమైన ఛార్జింగ్ కలిగి ఉంటుంది. ఇన్-వీల్ మోటార్, స్టాండర్డ్ ఎకానమీ రైడ్ మోడ్‌లు, CAN-కంట్రోల్ ఆటో కట్ ఛార్జర్ వంటి ఫీచర్స్ దీని ప్రత్యేకతలు. డిజిటల్ డిస్‌ప్లే, స్మార్ట్ స్టోరేజ్, ఆకర్షణీయమైన డిజైన్ వినియోగదారులను ఇష్టపడేలా చేస్తున్నాయి . QC1 స్కూటర్ నగర ప్రయాణాలకు అనుకూలంగా ఉంటూ , తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వల్ల ప్రస్తుత తరానికి సరైన ఎంపికగా నిలుస్తుంది.
హోండా QC1 ఎలక్ట్రిక్ స్కూటర్
ఇది ఆధునిక నగర ప్రయాణాలకు అనువుగా రూపొందించబడిన ఒక స్మార్ట్ , పర్యావరణహిత స్కూటర్ . ఇది 1.5 kWh లిథియమ్-అయాన్ బ్యాటరీతో వస్తుంది.1.8 kW పవర్, 77 Nm టార్క్ ను అందిస్తుంది. BLDC మోటార్‌తో ఇది సాఫ్ట్ , సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.దీని టాప్ స్పీడ్ 50 kmph. కేవలం 9.4 సెకన్లలో 0-40 km/h వేగాన్ని చేరుతుంది.
ఫీచర్స్
ఇది స్టాండర్డ్ , ఎకానమీ రైడ్ మోడ్‌లు, 12.70 సెం.మీ LCD డిజిటల్ డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్ పోర్ట్, CAN-కంట్రోల్ ఆటో కట్ ఛార్జర్ లాంటి లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి . భద్రతా పరంగా ముందు 130 mm , వెనుక 110 mm డ్రమ్ బ్రేకులు, కాంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS), LED లైటింగ్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ రియర్ స్ప్రింగ్స్ , ఫ్రంట్ బ్లాక్ అలోయ్ వీల్స్ ఉన్నాయి.
ఛార్జింగ్ కోసం 330W CAN-కంట్రోల్ ఆటో కట్ ఛార్జర్ తో వస్తుంది .ఇది సాధారణ 6A హౌస్‌హోల్డ్ పవర్ సాకెట్ ద్వారా పనిచేస్తుంది. 0-100% ఛార్జ్ కావడానికి 6.5 గంటలు, 0-80% ఛార్జ్ కావడానికి 4.5 గంటలు పడుతుంది.బ్యాటరీ IP67 వాటర్ & డస్ట్ రెసిస్టన్స్ ప్రొటెక్షన్ ఉంటుంది.
7° గ్రేడ్‌బిలిటీ, 169 mm గ్రౌంగ్ క్లియరెన్సు , 704 mm సీట్ హైట్, 1275 mm వీల్ బేస్ , 89.5 kg కర్బ్ వెయిట్, 26 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ ఉన్నాయి.ముందు 12 ఇంచ్ , బ్యాక్ 10 ఇంచ్ టైర్స్ ఉంటాయి. వాహనం, బ్యాటరీ, ఛార్జర్‌పై 3 సంవత్సరాలు లేదా 50,000 km వారంటీ అందించబడుతుంది.కలర్స్ లో Pearl Serenity Blue, Matt Foggy Silver Metallic, Pearl Igneous Black, Pearl Misty white, Pearl Shallow Blue ఉన్నాయి.
ధర
దీని ప్రారంభ ఎక్స్ షో రూమ్ ధర ₹ 90487/-
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయాణం చేయగలిగే కెపాసిటీ తో కలిగి ఉండటం వల్ల నగర జీవనశైలికి సరైన ఎంపికగా నిలుస్తుంది.
Read more news like this on telugu.timesnownews.com

