హోండా యాక్టివా 125 స్కూటర్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనాలలో ఒకటి. ఈ స్కూటర్ తన శక్తివంతమైన 125cc ఇంజిన్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, ఆకర్షణీయమైన డిజైన్‌తో ప్రత్యేకతను సాధించింది.
నగర ప్రయాణాలకు అనువైన ఈ వాహనం మైలేజ్, పెర్ఫార్మన్స్ , విశ్వసనీయతలో అగ్రగామిగా నిలుస్తుంది. హోండా అందించిన ఆధునిక సాంకేతికత, స్మూత్ స్టార్టింగ్ సిస్టమ్, భద్రతా ఫీచర్లు వినియోగదారులకు నమ్మకాన్ని కలిగిస్తాయి. కుటుంబ అవసరాలు, రోజువారీ ప్రయాణాలు, లాంగ్ టైం వినియోగానికి ఇది సరైన ఎంపికగా నిలుస్తుంది. యాక్టివా 125 స్కూటర్ పవర్ , స్టైల్ తో ప్రతి రైడర్‌కు ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. దీని వేరియంట్ వైస్ లేటెస్ట్ ధరలు , మైలేజ్ , ఫీచర్స్ చూదాం
హోండా యాక్టివా 125
హోండా యాక్టివా 125 స్కూటర్ భారతీయ మార్కెట్లో అత్యంత విశ్వసనీయమైన , ప్రజాదరణ పొందిన వాహనాలలో ఒకటి. ఈ స్కూటర్ 124cc BS6 కంప్లయింట్ ఇంజిన్‌తో వస్తుంది.6.20 kW @ 6500 rpm పవర్ , 10.5 Nm @ 5000 rpm టార్క్ ను ANDISTUNDI. ఇది సుమారు 45-50 kmpl మైలేజ్‌ను ఇస్తుంది. ఇది నగర ప్రయాణాలకు , రోజువారీ ఉపయోగానికి బెస్ట్ .
ఫీచర్స్
హోండా అందించిన H- స్మార్ట్ కీ సిస్టం, TFT డిస్‌ప్లే, హోండా RoadSync బ్లూటూత్ కనెక్టివిటీ, LED హెడ్‌ల్యాంప్, USB-C ఛార్జింగ్ పోర్ట్, ఓపెన్ గ్లోవ్ బాక్స్ వంటి ఆధునిక ఫీచర్స్ వినియోగదారులకు మంచి కంపార్ట్ కలిగిస్తాయి. భద్రతా పరంగా సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, ట్యూబ్‌లెస్ టైర్స్, Combi Brake System (CBS) వంటి ఫీచర్లు రైడర్‌కు నమ్మకాన్ని కలిగిస్తాయి.
సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్‌లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, రియర్‌లో 3-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉండటం వల్ల రోడ్డుపై గుంతలు, ఎగుడు దిగుడు ఉన్నా సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో ఫ్రంట్ డిస్క్ , రియర్ డ్రమ్ బ్రేకులు ఉండటం వల్ల నియంత్రణ మరింత మెరుగ్గా ఉంటుంది. 1260 mm వీల్ బేస్, 765 mm సీట్ హైట్, 162 mm గ్రౌండ్ క్లియరెన్సు ,107 Kg కెర్బ్ వెయిట్ , 5.3 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటితో ఉంటుంది.
హోండా యాక్టివా 125 స్కూటర్ Rebel Red Metallic, Pearl Nightstar Black, Heavy Grey Metallic, Midnight Blue Metallic, Pearl Precious White వంటి ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. వేరియంట్స్‌లో DLX , H-Smart మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ౩సంవత్సరాలు లేదా 36,000 km వారంటీతో పాటు దీన్ని 10 సంవత్సరాల వరకు ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు.
వేరియంట్ ధరలు
ACTIVA 125 DLX వేరియంట్ తెలంగాణ ఎక్స్ షో రూమ్ ధర ₹ 93316/-
ACTIVA 125 SMART వేరియంట్ తెలంగాణ ఎక్స్ షో రూమ్ ధర ₹ 97760/-
Read more news like this on telugu.timesnownews.com

