Dailyhunt
IITలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, కట్ చేస్తే...కార్పోరేట్ లైఫ్ వదిలేసి సింగర్ అవతారమెత్తిన టాపర్!

IITలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, కట్ చేస్తే...కార్పోరేట్ లైఫ్ వదిలేసి సింగర్ అవతారమెత్తిన టాపర్!

Times Now Telugu 1 week ago

JEEలో మంచి ర్యాంకు సాధించి ఐఐటీ పూర్తి చేసి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేయాలని ఎంతో మంది కష్టపడుతుంటారు. ఆలిండియా నెం1 ర్యాంకు సాధించినప్పటికీ, కార్పొరేట్ లైఫ్ ఇష్టం లేక సింగర్‌గా మారాడు ఓ వ్యక్తి.

ఇండియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జేఈఈ పరీక్షలో.... కల్పిత్ వీర్వాల్ అనే స్టూడెంట్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకు పొందాడు. 360కుగాను 360 మార్కులు పొంది సంచనలంగా మారాడు. 2017లో 100 శాతం మార్కులు పొందిన కల్పిత్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో కూడా చోటు దక్కించుకున్నాడు.

కార్పొరేట్ లైఫ్ ఇష్టం లేక....

జేఈఈలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు పొంది సంచలనంగా మారిని కల్పిత్...ఐఐటీ తర్వాత పెద్ద సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరతాడని అందరూ భావించారు. అతను మాత్రం కార్పొరేట్ లైఫ్ ఇష్టంలేక, తనకు నచ్చిన వాటిపై ఫోకస్ చేశాడు.

కార్పొరేట్ లైఫ్‌ను తానెప్పుడు కోరుకోలేదని కల్పిత్ తెలిపాడు. కేవలం ఒకే ఉద్యోగంలో స్థిరపడిపోవడం ఇష్టంలేక... టీచింగ్, వెంచర్స్ ప్రారంభించడం, పబ్లిక్ స్పీకింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా చేశాడు. ఆలిండియా ర్యాంకు పొందిన కల్పిత్ కెరీర్ అందరూ ఊహించినట్లుగా సాధారణంగా లేదు. కల్పిత్ తనకు నచ్చిన విభిన్నమైన వాటిని ఎంచుకున్నాడు.
ఇటీవలే తాను మ్యూజిక్ రంగాన్ని ఎంచుకున్నాడు. సింగర్‌, పాటల రచయితగా మారాడు. కొత్త పాటలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపాడు. కల్పిత్ వీర్వాల్ తన కేరీర్‌కు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచకున్నాడు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో చేసిన పోస్ట్‌లో తన కేరీర్‌ గురించిన వివరాలు షేర్ చేశాడు.

" 9 ఏళ్ల క్రితం ఈ రోజున( ఏప్రిల్ 2,2017) జేఈఈలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు పొందాను. 360/360 మార్కులు పొందిన మొదటి వ్యక్తిని. ఆరోజు సాధారణమైనదే అనిపించినప్పటికీ, నా జీవితాన్ని మార్చేసింది. ఒకే రాత్రిలో హైస్కూల్ నుండి జాతీయవార్తల్లో నిలిచాను.
సాధారణ కార్పొరేట్ ఐఐటీ కెరీర్‌ను నాకెప్పుడు నచ్చలేదు .నేను పొందిన ర్యాంకుతో వచ్చిన పాపులారిటీతో విభిన్నమైన కెరీర్‌ను ఎంచుకునేందుకు సహాయపడింది.

గత కొన్నేళ్లుగా నేను ఒక టీచర్‌గా పనిచేశాను, బిజినెస్ చేశాను,దేశవ్యాప్తంగా ప్రసంగాలు ఇచ్చాను,పెట్టుబడులు,ప్రయాణాలు చేశాను, ఇటీవలే ఒక సింగర్-సాంగ్ రైటర్‌గా నా సొంత మ్యూజిక్ రిలీజ్ చేయడం ప్రారంభించాను.

నేను ఈ మధ్య ఇన్వెస్ట్‌మెంట్, మ్యూజిక్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాను. ఈ ఏడాదిలో మీరు నా మ్యూజిక్‌ను మరింతగా వింటారు. (లింక్ కామెంట్స్‌లో ఉంది). నా జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, ఇది కేవలం నా కథ మాత్రమే కాదు, అనేక విధాలుగా మనందరి కథ " అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు.

నెటిజెన్స్ రియాక్షన్ ఎలా ఉందంటే..

సోషల్ మీడియాలో తన కెరీర్ గురించి జేఈఈ ఆలిండియా ర్యాంకర్ కల్పిత్ వీర్వాల్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజెన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. తన ఇష్టాల మేరకు నచ్చిన కోర్సును ఎంచుకోవడాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. మరికొంత మంది ఆలిండియా ర్యాంకు కోసం అంతగా కష్టపడిన తర్వా ఆ రంగాన్ని ఎందుకు వదిలేశాడని ప్రశ్నిస్తున్నారు.

కెరీర్‌లో కొత్తవాటిని ప్రయత్నించడాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. కల్పిత్ మ్యూజిక్ ఎంచుకోవడం కంటే, బిజినెస్ లేదా కార్పొరేట్ విభంగాలో ఉద్యోగం చేస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరూ ఒకే మార్గాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని, ఇష్టాలు అనేవి వ్యక్తిగతమైనవని మరింత మంది నెటిజెన్స్ పేర్కొన్నారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu