Dailyhunt
Income tax returns: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి

Income tax returns: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి

Times Now Telugu 1 week ago

న్‌కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే ప్రక్రియ ఎంతో సులభతరమైంది. అయితే ఇప్పటికీ పలువురు టాక్స్ పేయర్స్ ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో మిస్టేక్స్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో చేయకూడని మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం!

ఐటీఆర్ ఫైలింగ్ విషయంలో సరైన ఫారమ్ ఎంచుకోకపోవడం, పూర్తి ఆదాయాన్ని ప్రకటించకపోవడం, సరైన వివరాలు సబ్‌మిట్ చేయకపోవడం వంటి మిస్టేక్స్ చేయకూడదు. ఫైలింగ్‌కు ముందుగానే డాక్యుమెంట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. FY26 (AY27)కు సంబంధించి టాక్స్ పేయర్స్ ఐటీఆర్ ఫైల్ చేసేందుకు జులై 1, 2026 వరకు గడువు ఉది. ఐటీఆర్ ఫారమ్ 3, 4 ఎంచుకునే వారు ఆగస్టు 31,2026 వరకు ఐటీఆర్ సబ్‌మిట్ చేయవచ్చు.

ఏ ఐటీఆర్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి?

  • ఐటీఆర్-1 ఫారం: ఒక హౌజ్ ప్రాపర్టీ ,ఇతర ఆదాయ వనరులు కలిగిన శాలరీ పొందే వ్యక్తులు ఈ ఫారమ్ ఎంచుకోవాలి.
  • ఐటీఆర్-2 ఫారం: బిజినెస్ ఇన్‌కమ్ లేని వ్యక్తి లేదా హిందూ అవిభక్త కుటుంబం (HUF) లోని వ్యక్తుల కోసం ఇది ఇద్దేశించినది.
  • ఐటీఆర్-3 ఫారం: బిజినెస్ లేదా ప్రొఫెషన్ ద్వారా ఆదాయం ఉన్న వ్యక్తి లేదా HUF వారి కోసం.
  • ఐటీఆర్-4 ఫారం: బిజినెస్ లేదా ప్రొఫెషన్ నుండి ఆదాయం ఉన్న టాక్స్ పేయర్స్ కోసం.


ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో చేయకూడని మిస్టేక్స్ ఇవే !

  • ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో సరైన ఫారమ్ ఎంచుకోవాలి.
  • ఫైలింగ్ చేసిన తర్వాత ఐటీఆర్‌ను వెరిఫై చేయాలి. ఇ-ఫైలింగ్ చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్, ఆధార్ కార్డు లేదా ఈవీఎస్ ప్రాసెస్ ద్వారా ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ వెరిఫై చేయాల్సి ఉంటుంది.
  • అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన వివరాలు, పేరు, అడ్రస్, ఇమెయిల్, పాన్ నంబర్, ఫోన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలు సరైన విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సరైన అసెస్‌మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోకపోవడం వలన డబుల్ టాక్సేషన్‌ జరగవచ్చు. వివరాలు సరైన విధంగా ఫిల్ చేయకపోతే రీఫండ్ ప్రాసెస్ ఆలస్యం కావచ్చు. DD/MM/YYYY వంటి సరైన ఫార్మాట్‌లో వివరాలు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
  • సరైన టాక్స్ రెజీమ్ సెలెక్ట్ చేసుకోవడం వలన అనవసరమైన డిడక్షన్స్ జరిగే అవకాశం ఉంది.
  • సేవింగ్స్ అకౌంట్, శాలరీ, రెంట్ లేదా ప్రాపర్టీ ఇన్‌కమ్, క్యాపిటల్ గెయిన్స్ వంటి ఇన్‌కమ్ సోర్సెస్ గురించి పేర్కోవాలి. ఆదాయపు పన్ను మినహాయింపు లభించినా? లేకపోయినా, వాటిని కచ్చితంగా ఐటీఆర్‌లో పేర్కొనాలి.
  • ఫామ్ 26AS, యాన్యువల్ ఇన్‌ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS)లో వివరాలు సరిపోలేలా జాగ్రత్త వహించాలి. వీటిలో అడ్వాన్స్‌ టాక్స్ సిస్టమ్, టాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (TCS), టాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) వంటి వివరాలు ఉంటాయి. ఈ వివరాలు సరిపోలకపోతే టాక్స్ నోటీసు వచ్చే అవకాశం ఉంటుంది, దీనితో పాటు రీఫండ్ ఆలస్యం కావచ్చు.
  • వేతనం పొందే ఉద్యోగులు ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ఎంప్లాయర్స్ ఉన్నట్లయితే అన్ని కంపెనీల ఫారమ్ 16 సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.
  • గడువు తేదీలోగా అడ్వాన్స్ టాక్స్‌ను చెల్లించాల్సి ఉంటుంది.
  • టాక్స్ పేయర్స్, మూలధన లాభాలను ఆర్జించి, ఆ లాభాలలో కొంత భాగాన్ని తిరిగి పెట్టుబడిగా పెడతారు. అయితే 54, 54EC, లేదా 54F వంటి సంబంధిత సెక్షన్ల కింద మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడం మర్చిపోతారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu