Dailyhunt
ఇండోనేషియాలో భారీ భూకంపం, 7.4గా తీవ్రత... 1,000 కి.మీ పరిధి వరకు సునామీ హెచ్చరిక జారీ

ఇండోనేషియాలో భారీ భూకంపం, 7.4గా తీవ్రత... 1,000 కి.మీ పరిధి వరకు సునామీ హెచ్చరిక జారీ

Times Now Telugu 1 week ago

ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దీంతో సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... తూర్పు ఇండోనేషియాలో గురువారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో శక్తివంతమైన సముద్ర భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది.

భూకంప కేంద్రం నుండి 1,000 కిలోమీటర్ల పరిధిలో ప్రమాదకరమైన సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ భూకంపం వల్ల చోటుచేసుకున్న నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు లేవు.

యూఎస్‌జీఎస్ ప్రకారం... ఈ భూకంప కేంద్రం 1.20 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 126.35 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇక, చైనా ఎర్త్‌క్వేక్ నెట్‌వర్క్స్ సెంటర్ నివేదిక ప్రకారం... ఈ భూకంపం సుమారు 30 కిలోమీటర్ల లోతులో సంభవించింది.

అయితే భూకంప పర్యవేక్షణ సంస్థలు తొలుత భూకంప తీవ్రతను 7.8గా పేర్కొన్నాయి. అయితే ఆ తర్వాత భూకంప తీవ్రతను 7.4గా సవరించాయి. అయితే స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం సుమారు 6:48 గంటలకు మొలుక్కా సముద్రంలో సంభవించింది.

హవాయి కేంద్రంగా పనిచేసే పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం... భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల పరిధిలో, ముఖ్యంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీర ప్రాంతాలలో ప్రమాదకరమైన సునామీ అలలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది.

టెక్టోనిక్ ప్లేట్ల పరస్పర చర్య వల్ల ఏర్పడిన అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్లతో కూడిన 40,000 కిలోమీటర్ల విస్తారమైన వలయమైన పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి ఇండోనేషియా ఉండటం వల్ల ఇక్కడ భూకంపాలు సంభవించడం సాధారణం. ఇండోనేషియా ప్రపంచంలోనే అత్యంత భూకంప క్రియాశీలక ప్రాంతాలలో ఒకటిగా ఉంది.

ఇదిలాఉంటేట, ఈ ఏడాది మార్చి 3న సుమత్రా తీరంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూఎస్‌జీఎస్ తెలిపింది. ఆ భూకంపం సుమత్రా ఈశాన్య కొన సమీపంలో సముద్రంలో సంభవించింది. ఈ భూకంపంతో ప్రజలు ప్రకంపనల అనుభూతి చెందినప్పటికీ, చినప్పటికీ, పెద్దగా నష్టం కలిగించలేదు. అయితే చాలా మంది నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu