Dailyhunt
IPL 2026 MI vs LSG: భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై ఇండియన్స్.. లక్నోకి ఇక కష్టమే..

IPL 2026 MI vs LSG: భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై ఇండియన్స్.. లక్నోకి ఇక కష్టమే..

Times Now Telugu 1 week ago

IPL 2026 MI vs LSG: ఐపీఎల్ 2026 సీజన్‌లో మిణుకు మిణుకుమంటూ ఉన్న ఆశలను నిలుపుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజృంభించింది.

గాయంతో కొన్ని మ్యాచులకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ రీఎంట్రీలో అదిరిపోయే హాఫ్ సెంచరీతో రాణించగా రియాన్ రికెల్టన్ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 10.4 ఓవర్లలో తొలి వికెట్‌కి 143 పరుగుల భాగస్వామ్యం జోడించి... ముంబై ఇండియన్స్ విజయానికి బాటలు వేశారు.

229 పరుగుల భారీ లక్ష్యఛేదనలో ముంబై ఇండియన్స్‌కి అదిరిపోయే ఆరంభం అందించారు రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్. ఈ ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కి 143 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

రియాన్ రికెల్టన్ 32 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లతో 83 పరుగులు చేసి, ఎం సిద్ధార్థ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ 44 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సర్లతో 84 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తిలక్ వర్మ 13 బంతుల్లో 11 పరుగులు చేసి ఎం. సిద్ధార్థ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ 7 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. నమన్ ధీర్ 23, విల్ జాక్స్ 10 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు.

  • లక్నో భారీ స్కోరు..

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోరు చేసింది.

జోష్ ఇంగ్లీష్, మిచెల్ మార్ష్‌తో కలిసి ఓపెనింగ్ చేశాడు. 5 బంతుల్లో 3 ఫోర్లతో 13 పరుగులు చేసిన జోష్ ఇంగ్లీష్‌ని ఘజన్‌ఫర్ అవుట్ చేశాడు. మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ కలిసి బౌండరీల మోత మోగించారు. వీరిద్దరి బాదుడికి పవర్ ప్లేలో 90 పరుగులు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. ఐపీఎల్‌లో లక్నోకి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు.

6.5 ఓవర్లలో 100 పరుగులు చేసేసింది లక్నో సూపర్ జెయింట్స్. నికోలస్ పూరన్ 16 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో పూరన్‌కి ఇదే మొట్టమొదటి హాఫ్ సెంచరీ. 8 ఓవర్లలో 123 పరుగులు చేసిన లక్నో సూపర్ జెయింట్స్, రికార్డు స్కోరు చేసేలా కనిపించింది. అయితే 21 బంతుల్లో ఓ ఫోర్, 8 సిక్సర్లతో 63 పరుగులు చేసిన నికోలస్ పూరన్‌ని కార్బిన్ బాష్ అవుట్ చేశాడు.

అదే ఓవర్‌లో మిచెల్ మార్ష్ కూడా పెవిలియన్ చేరాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు మిచెల్ మార్ష్. ఒకే ఓవర్‌లో 2 వికెట్లు పడడంతో లక్నో సూపర్ జెయింట్స్ స్కోరు వేగం తగ్గింది.

10 ఓవర్లలో 141 పరుగులు చేసింది లక్నో సూపర్ జెయింట్స్. 10 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 15 పరుగులు చేసిన రిషబ్ పంత్‌ని విల్ జాక్స్ అవుట్ చేశాడు.

  • సిక్సర్‌తో ఐపీఎల్ ఎంట్రీ...

మొట్టమొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న అక్షత్ రఘువంశీ, విల్ జాక్స్ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో ఖాతా ఓపెన్ చేశాడు. అయితే 11 పరుగులు చేసిన అక్షత్ రఘువంశీని మొట్టమొదటి మ్యాచ్ ఆడుతున్న రఘు శర్మ అవుట్ చేశాడు. అయిడిన్ మార్క్‌రమ్, హిమ్మత్ కలిసి ఆరో వికెట్‌కి అజేయంగా 68 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయిడిన్ మార్క్‌రమ్ 25 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 31 పరుగులు చేయగా హిమ్మత్ సింగ్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu