Dailyhunt
IPL 2026 RCB vs GT: అహ్మదాబాద్‌లో ఆర్‌సీబీ ఆలౌట్.. గుజరాత్ ముందు ఈజీ టార్గెట్..

IPL 2026 RCB vs GT: అహ్మదాబాద్‌లో ఆర్‌సీబీ ఆలౌట్.. గుజరాత్ ముందు ఈజీ టార్గెట్..

Times Now Telugu 1 week ago

IPL 2026 RCB vs GT: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా నేడు అహ్మదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 19.2 ఓవర్లలో 155 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

జాకబ్ బెథెల్ ఓ ఫోర్‌తో 5 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 13 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. దేవ్‌దత్ పడిక్కల్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ పటిదార్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేయగా జితేశ్ శర్మ 1, టిమ్ డేవిడ్ 9, కృనాల్ పాండ్యా 4, రొమారియో షెఫర్డ్ 2 సిక్సర్లతో 17 పరుగులు, వెంకటేశ్ అయ్యర్ 12 పరుగులు చేశారు. భువనేశ్వర్ కుమార్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జోష్ హేజల్‌వుడ్‌ మొదటి బంతికే రనౌట్ అయ్యాడు.

  • మెరుపులా మొదలై...

ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌కి ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. మహ్మద్ సిరాజ్ వేసిన మొదటి ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. కగిసో రబాడా వేసిన రెండో ఓవర్‌లో విరాట్ కోహ్లీ వరుసగా 4, 4, 4, 4, 4 రూపంలో 5 ఫోర్లు బాది 25 పరుగులు రాబట్టాడు. ఒకే ఓవర్‌లో 5 ఫోర్లు బాదిన మూడో ఆర్‌సీబీ బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు క్రియేట్ చేశాడు. 2013లో పూణే వారియర్స్ ఇండియాపై క్రిస్ గేల్, 2016లో రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్‌పై షేన్ వాట్సన్ ఒకే ఓవర్‌లో 5 ఫోర్లు బాదారు. మూడో ఓవర్‌లో జాకబ్ బెథల్‌ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేయగా ఆ తర్వాతి ఓవర్‌లో విరాట్ కోహ్లీని రబాడా అవుట్ చేశాడు.

పవర్ ప్లేలో 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

  • హోల్డర్ హోల్డింగ్..

బౌలింగ్‌లో 2 వికెట్లు తీసిన జాసన్ హోల్డర్, ఫీల్డింగ్‌లో 3 క్యాచులు అందుకున్నాడు. అర్షద్ ఖాన్‌కి 3 వికెట్లు దక్కగా రషీద్ ఖాన్ 2 వికెట్లు తీశాడు. మహ్మద్ సిరాజ్, కగిసో రబాడా చెరో వికెట్ తీశారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu