Dailyhunt
IPL 2026 SRH vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి రెండో ఓటమి.. బోణీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్...

IPL 2026 SRH vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి రెండో ఓటమి.. బోణీ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్...

Times Now Telugu 1 week ago

IPL 2026 SRH vs LSG: మిచెల్ మార్ష్, అడియిన్‌ మార్క్‌రమ్ కలిసి లక్నో సూపర్ జెయింట్స్‌కి శుభారంభం అందించారు. 12 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసిన మిచెల్ మార్ష్‌ని ఇషాన్ మలింగ అవుట్ చేశాడు.

27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు చేసిన అయిడిన్ మార్క్‌రమ్‌ని శివంగ్ కుమార్ అవుట్ చేశాడు.

ఆయుష్ బదోనీ 9 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి హర్ష్ దూబే బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. నికోలస్ పూరన్ 1 పరుగు చేసి రనౌట్ అయ్యాడు. అబ్దుల్ సమద్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివరి 2 ఓవర్లలో లక్నో సూపర జెయింట్స్ విజయానికి 13 పరుగులు మాత్రమే కావాల్సి వచ్చాయి.

ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కుదురుకుపోయిన రిషబ్ పంత్, తన స్టైల్‌కి విరుద్ధంగా స్లోగా బ్యాటింగ్ చేశాడు. లక్ష్యం తక్కువగా ఉండడంతో నెమ్మదిగా ఆడుతూ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

  • ఆఖర్లో ఉత్కంఠ...

హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో 4 పరుగులే వచ్చాయి. ఆ ఓవర్ ఆఖరి బంతికి ముకుల్ చౌదరి అవుట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. అయితే లక్నో డీఆర్‌ఎస్ కోరుకోగా రిప్లైలో బంతి ఇంపాక్ట్ అవుట్‌సైట్‌గా కనిపించింది. దీంతో ముకుల్ నాటౌట్‌గా తేలాడు.

ఆఖరి ఓవర్‌లో లక్నో విజయానికి 9 పరుగులు అవసరం అయ్యాయి. జయ్‌దేవ్ ఉనద్కట్ వేసిన ఆఖరి ఓవర మొదటి బంతికి రిషబ్ పంత్ ఫోర్ బాదేశాడు. రెండో బంతికి కూడా ఫోర్ రావడంతో మ్యాచ్ లక్నో చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత రెండు డాట్ బాల్స్ ఆడిన రిషబ్ పంత్, ఐదో బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించేశాడు. 50 బంతుల్లో 9 ఫోర్లతో 68 పరుగులు చేశాడు రిషబ్ పంత్..

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. మొదటి ఓవర్‌ ఆఖరి బంతికి అభిషేక్ శర్మను డకౌట్ చేసిన మహ్మద్ షమీ, రెండో ఓవర్‌లో స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ని కూడా అవుట్ చేశాడు. ఇషాన్ కిషన్ 1 పరుగు చేసి, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 20 బంతులు ఆడి ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన లియామ్ లివింగ్‌స్టోన్, దిగ్వేష్ సింగ్ రతి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

  • షమీ టాప్ క్లాస్..

మొదటి ఓవర్‌లో 1 పరుగు మాత్రమే ఇచ్చిన మహ్మద్ షమీ, రెండో ఓవర్‌లో కూడా ఒకే పరుగు ఇచ్చాడు. తన మూడో ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చిన మహ్మద్ షమీ, ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో మళ్లీ బౌలింగ్‌కి వచ్చి 2 సింగిల్స్ మాత్రమే ఇచ్చాడు.

ఓవరాల్‌గా 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చిన మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ షమీకి తోడు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ సింగ్ రతి టాప్ క్లాస బౌలింగ్ పర్ఫామెన్స్ కారణంగా పవర్ ప్లేలో 22/3 స్కోరు మాత్రమే చేయగలిగింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 35/4 స్కోరు మాత్రమే వచ్చింది.

అరవీర భయంకర బ్యాటర్లు, విధ్వంసక ప్లేయర్లు ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్, 2 ఓవర్లలో చేసే 35 పరుగులు చేయడానికి, 10 ఓవర్లు పట్టింది.

  • ఆదుకున్న నితీశ్ - క్లాసిన్ భాగస్వామ్యం...

26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ని నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసిన్ కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 పరుగులు చేసిన నితీశ్ కుమార్ రెడ్డిని మణిమారన్ సిద్ధార్థ్ అవుట్ చేశాడు.

41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసిన హెన్రీచ్ క్లాసిన్‌ని అవుట్ చేసిన ఆవేశ్ ఖాన్, తర్వాతి బంతికి హర్ష్ దూబేకి క్లీన్ బౌల్డ్ చేశాడు. శివంగ్ కుమార్ 5 పరుగులు చేయగా హర్షల్ పటేల్ 4 పరుగు చేసి రనౌట్ అయ్యాడు.

లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, ప్రిన్స్ యాదవ్, ఆవేశ్ ఖాన్ రెండేసి వికెట్లు తీశారు. దిగ్వేష్ సింగ్ రతి, మణిమారన్ సిద్ధార్థ్ చెరో వికెట్ తీశారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu