Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జనసేనకు బిగ్ షాక్... హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ

జనసేనకు బిగ్ షాక్... హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరణ

Times Now Telugu 6 days ago

నసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జూన్ 2వ తేదీన హైదరాబాద్‌లో తలపెట్టిన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... పవన్ కల్యాణ్ మంగళవారం రోజన (జూన్ 2వ తేదీన) హైదరాబాద్‌లో సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ-జనసేన సాధక్ సమ్మేళం పేరుతో జనసేన ఈ సభ నిర్వహించాలని భావించింది. గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్‌లో మధ్యాహ్నం 3.00 గంటలకు సభ ప్రారంభించాలని నిర్ణయించింది. అయితే ఇందుకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు (జూన్ 2) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, శాంతి భద్రతల దృష్ట్యా హైదరాబాద్ పవన్ కల్యాణ్ సభకు పోలీసులు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది.

అయితే తమ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించారని జనసేన పార్టీ కూడా తెలిపింది. 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' సభకి ప్రభుత్వం అనుమతి నిరాకరించిందని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర నాయకులు, క్రియాశీలక కార్యకర్తలతో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు పార్టీ భవిష్యత్ కార్యాచరణ, రాష్ట్ర అభివృద్ధిలో జనసేన పోషించాల్సిన పాత్ర, జనసేన పార్టీ బలోపేతానికి సంబంధించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసుకునే కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం అర్థరహితమని విమర్శించింది.

ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వ్యాఖ్యలను ఆయనే ఉపసంహరించుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కూడా చర్యలు ఉండవు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజాముఖంగానే తెలిపారని జనసేన పార్టీ పేర్కొంది. గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ హాల్ లో నిత్యం ఎన్నో సాంస్కృతిక, రాజకీయ, కార్పొరేట్ కంపెనీల సమావేశాలు జరుగుతూనే ఉంటాయని... అప్పుడు ఎప్పుడూ రాని పార్కింగ్ సమస్య జనసేన పార్టీ కార్యక్రమానికి అడ్డంకిగా చూపి నిరాకరించడం సహేతుకం కాదని మండిపడింది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu