ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ ఒక్కో నెట్‌వర్క్‌లో ఒక్కో విధంగా ఉంటాయి. జియో, ఎయిర్టెల్, వీఐ, BSNL నెట్‌వర్క్‌లలో ప్లాన్స్, బెనిఫిట్స్ వేర్వేరుగా ఉంటాయి.
అయితే రూ. 200 లోపు ఏ నెట్‌వర్క్‌లో ఏ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నాయి, వాటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం!
టెలికా సంస్థలు వాయిస్, వ్యాలిడిటీ, డేటా కోసం ఇలా వివిధ రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చాయి. రూ. 200 లోపు అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..
రిలయన్స్ జియో
జియో టెలికాంలో రూ.200 లోపు 4 రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.
జియో రూ.198 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా 14 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ మొత్తం 28 జీబీ డేటా లభిస్తుంది.
14 రోజుల అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.
దీనితో పాటు జెయో టీవీ, జియో ఏఐ క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందవచ్చు.
జియో రూ.149 రీచార్జ్ ప్లాన్
జియో యూజర్స్ కోసం ప్రవేశపెట్టిన క్రికెట్ డేటా ప్యాక్.
రూ.149 రీఛార్జ్ ప్లాన్ ద్వారా 30 రోజుల పాటు 10 జీబీ డేటా పొందవచ్చు.
జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 90 రోజుల పాటు ఉచితంగా లభిస్తుంది.
హైస్పీడ్ డేటా లిమిట్ పూర్తైన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbps కు తగ్గుతుంది.
జియో రూ.200 రీఛార్జ్ ప్లాన్
మెగా కంటెంట్ యాడ్ ఆన్ ప్లాన్ ద్వారా రూ.200 కే అందుబాటులో ఉంది.
ఈ ప్లాన్ ద్వారా 5 జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటితో లభిస్తుంది.
ఈ ప్లాన్‌లో భాగంగా YouTube ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. వీటిని మై జియో యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.
సోనిలివ్, జీ 5, లయన్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, Kanchha Lannka, ప్లానెట్ మరాఠీChaupal, ఫ్యాన్‌కోడ్ Hoichoi సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. వీటిని JioTV మొబైల్ యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలి.జియో హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ కూడా పొందవచ్చు.
ఎయిర్టెల్
రూ.199 ఎయిర్టెల్
దీని ద్వారా 28 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాల్స్/ ఎస్టీడీ/ రోమింగ్కాల్స్ పొందవచ్చు.
2జీబీ హై స్పీడ్ డేటా, 300 ఎస్ఎమ్ఎస్‌లు పొందవచ్చు.
రూ.195 రీఛార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా 30 రోజుల పాటు 12 జీబీ డేటా లభిస్తుంది. జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 3 నెలల పాటు పొందవచ్చు.
వొడాఫోన్ ఐడియా (VI)
రూ.101 వీఐ రీఛార్జ్ ప్లాన్
30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ ద్వారా 5జీబీ డేటా పొందవచ్చు. జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ 28 రోజుల పాటు లభిస్తుంది. ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ ఉండదు.
రూ.151 రీఛార్జ్ ప్లాన్
90 రోజుల పాటు 4 జీబీ డేటా లభిస్తుంది. 84 రోజులు జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ ఉండదు.
రూ.154 ప్లాన్
నెల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ ద్వారా 2 జీబీ డేటాతో పాటు 19 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ లభిస్తాయి. కేవలం మొబైల్‌లో మాత్రమే వీటికి యాక్సెస్ ఉంటుంది. ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ లభించదు.
రూ. 175 ప్లాన్
28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉన్న ఈ ప్లాన్ 10 జీబీ డేటా అందిస్తుంది. జియో హాట్ స్టార్, జీ5 వంటి మొత్తం 20 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్ (మొబైల్) పొందవచ్చు. ఎలాంటి సర్వీస్ వ్యాలిడిటీ ఉండదు.
BSNL
ప్లాన్ వోచర్ 107
దీని ద్వారా 20 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. 3జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. 200 నిమిషాలు లోకల్/ ఎస్టీడీ/ రోమింగ్ కాల్స్ చేసుకోవచ్చు.
ఎస్టీవీ 147
బీఎస్ఎన్‌ఎల్‌లోని STV-147 ప్లాన్ ద్వారా 24 రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్/ఎస్టీడీ కాల్స్ పొందవచ్చు. 5జీబీ డేటా కూడా లభిస్తుంది.
STV-99
ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా 14 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ పొందవచ్చు. 50MBడేటా లభిస్తుంది.
Disclaimer:
పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.... రీఛార్జ్ ప్లాన్స్, వ్యాలిడిటీ ఇతర ప్రయోజనాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం సంబంధిత టెలికాం సంస్థను సంప్రదించడం తప్పనిసరి!
Read more news like this on telugu.timesnownews.com

