Dailyhunt
కిల్లర్ ఎవరో గెస్ చేయండి, రూ.1 లక్ష గెలవండి.. అమెరికన్ నటి జో శర్మ  'M4M' మూవీ టీమ్ స్పెషల్ ఆఫర్! 15 అంతర్జాతీయ అవార్డులు కొల్లగొట్టి...

కిల్లర్ ఎవరో గెస్ చేయండి, రూ.1 లక్ష గెలవండి.. అమెరికన్ నటి జో శర్మ 'M4M' మూవీ టీమ్ స్పెషల్ ఆఫర్! 15 అంతర్జాతీయ అవార్డులు కొల్లగొట్టి...

Times Now Telugu 5 days ago

మెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు సినిమా 'ఎం4ఎం' (మర్డర్ ఫర్ మోటివ్). మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్‌లో 'M4M' మూవీని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పీవీఆర్ ఐకాన్స్ పిక్చర్స్ రిలీజ్ చేస్తున్న 'M4M' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకి టాలీవుడ్ దర్శకుల సంఘం అధ్యక్షుడు వి.ఎన్ ఆదిత్య, మరో డైరెక్టర్ వి. సముద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

  • దాసరి పుట్టినరోజు, దర్శకుల దినోత్సవం నాడు..

'దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినం నేడు. ఆయన పుట్టినరోజు దేశమంతా దర్శకుల దినోత్సవం జరుపుకుంటోంది. ఈ రోజు ఈ వేడుక జరగడం చాలా ప్రత్యేకం. మోహన్ వడ్లపట్ల, తన టీమ్‌ కలిసి ఓ గొప్ప సినిమాని తెరకెక్కించారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. జో శర్మకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది..' అన్నారు డైరెక్టర్ వి.ఎన్. ఆదిత్య.

'మే 8న విడుదల అవుతున్న M4M సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల గొప్ప దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటున్నా..' అంటూ వి. సముద్ర అన్నారు.

'ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్‌తో పాన్ ఇండియా లెవెల్‌లో మూవీని తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఈ మూవీ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటూ మూవీ టీమ్‌కి బెస్ట్ విషెస్' చెప్పారు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ పెండ్యాల.


  • అంతర్జాతీయ స్థాయిలో 15 అవార్డులు..

'M4M సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మోహన్ వడ్లపట్లకు థ్యాంక్యూ. ఈ సినిమా కోసం అమెరికా నుంచి వచ్చాను. ఇప్పటికే ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో 15కి పైగా అవార్డులు వచ్చాయి. వైవిధ్యం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ మూవీ కచ్ఛితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా..' అంటూ హీరోయిన్ జో శర్మ అంది.

  • కిల్లర్ ఎవరో గెస్ చేయండి, రూ.1 లక్ష గెలవండి..

'సినిమాలో సీరియల్ కిల్లర్ ఎవరో గెస్ చేసి చెప్పినవారికి లక్ష రూపాయల క్యాష్ ప్రైజ్ అందించబోతున్నాం. ఇది ఓ యూనివర్సల్ సబ్జెక్ట్. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. ఓ కొత్త సినిమాటిక్ అనుభవాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో M4M సినిమాని గ్రాండ్‌గా తెరకెక్కించాం..' అంటూ దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల అన్నాడు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu