కివీ పండు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రుచికి తియ్యగా ఉండే కివీ పండ్ల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కివీ పండులో ఫైబర్, విటమిన్స్‌తో పాటు ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి. రోజు ఒక కవీ పండు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు.
రోజుకు ఒక కివీ పండు తినడం వలన కలిగే బెనిఫిట్స్ ఇవే!
జీర్ణశక్తి పెరుగుతుంది
కొన్ని అధ్యయనాల ప్రకారం, కివీ పండు తినడం వలన మలబద్దకం, కడుపునొప్పి వంటి జీర్ణసంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంది. దీని వలన అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోయి, జీర్ణశక్తి పెరుగుతుంది. రెండు కివీ పండ్లలో నారింజ పండు కంటె ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వీటిలో కరిగే ఫైబర్ కూడా ఉంటుంది.
గుండె ఆరోగ్యం
ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కివీ పండులో పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ నుండి గుండెను కాపాడుతుంది. కివీ పండు తినడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
కివీ పండులో విటమిన్ సి కంటెంట్ ఉండటం వలన, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోజు రెండు కివీ పండ్లు తింటే శరీరానికి కావాల్సిన విటమిన్ సి లభిస్తుంది.
కంటి ఆరోగ్యం
కివీ పండ్లలో కెరోటినాయిడ్ అనే పదార్థం ఉంటుంది కాబట్టి వీటిని తినడం వలన కంటి ఆరోగ్యం మెరుగవుతుంది.కివీలోని లూటిన్ అనే పదార్థం వలన వయసు సంబంధిత కంటి సమస్యలు తగ్గుతాయి.
కివీ పండ్లు, వీరు అస్సలు తినకూడదు తెలుసా?
కివీ పండ్లు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కింది ఆరోగ్య సమస్యలు ఉన్నవారి వీటిని తినకపోవడం మంచిది. కివీ పండుతో అలర్జీ ఉన్నవారు వీటిని తినకపోవడం మంచిది. దీనితోపాటు పోలెన్ అలర్జీ ఉన్నవారు, కిడ్నీ స్టోన్స్ సమస్య ఉన్నవారు కూడా కివీ పండ్లను తినకపోవడం మంచిది.
కివీ జ్యూస్ vs పండ్లు, రెండింట్లో ఏది బెస్ట్ !
కివీని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే తాజా, పచ్చి కివీ జ్యూస్‌లోని బయో అవైలబిలిటీని పాశ్చరైజ్డ్ కివీ జ్యూస్‌తో పోల్చి చూస్తే, అందులో మొత్తం ఫినాల్స్,ఫ్లేవనాయిడ్లు, డైటరీ ఫైబర్ , ఆస్కార్బిక్ యాసిడ్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
కివీ జ్యూస్ కంటే కివీ పండు తినడం వలన ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణలు చెబుతున్నారు. కివీ పండులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. బయోఅవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. జ్యూస్ చేసుకుని తాగడం వలన ఇందులో ఉండే ఫైబర్, విటమిన్ సి లెవల్స్ తగ్గుతాయి. దీనితో పాటు జ్యూస్ తయారీలో చక్కెరను కూడా ఉపయోగించే అవకాశం ఉంది.
Disclaimer:
పైన తెలిపిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే....పాటించేముందు సంబంధిత నిపుణుల సలహా పాటించడం తప్పనిసరి!
Read more news like this on telugu.timesnownews.com

