ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యా్‌లో ఎంట్రీ ఇచ్చాడు శివంగ్ కుమార్. వస్తూనే ఓ చూడచక్కని షాట్ ఆడిన శివంగ్ కుమార్, ఆ తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు.
4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చిన శివంగ్ కుమార్, ఆరంగ్రేటం మ్యాచ్‌లో ఆశించిన స్థాయిలో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు. అయితే అతని బౌలింగ్, ఫీల్డింగ్.. ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా శివంగ్ కుమార్ బౌలింగ్ యాక్షన్ చూసేందుకు ఆఫ్ఘాన్ బౌలర్ నూర్ అహ్మద్ యాక్షన్‌లా తలపించింది.
ఐపీఎల్ 2026 వేలంలో శివంగ్ కుమార్‌ని రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌కి కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఆడకపోయినా, కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఐపీఎల్ ఆరంగ్రేటం చేశాడు.
- విజయ్ హాజారే ట్రోఫీ నుంచి..
ఈ ఏడాది విజయ్ హాజరే ట్రోఫీలో మధ్య ప్రదేశ్ జట్టు తరుపున ఆడిన శివంగ్ కుమార్, 3 మ్యాచుల్లో 10 వికెట్లు తీశాడు. కర్ణాటకతో మ్యాచ్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీలో 4 మ్యాచుల్లో 4 వికెట్లు తీసిన శివంగ్ కుమార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ దృష్టిలో పడ్డాడు..
వాస్తవానికి ఐపీఎల్ 2026 సీజన్‌కి ముందు పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ ట్రయల్స్‌కి హాజరయ్యాడట శివంగ్ కుమార్. అయితే ఆ టీమ్స్ రిజెక్ట్ చేయడంతో నిరాశ చెందాడు. రెండు సార్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్రయల్స్‌కి రమ్మని ఆహ్వానం అందినా.. సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20 టోర్నీ కారణంగా ఆ సెషన్స్‌లో పాల్గొనలేకపోయాడు.
అయితే ట్రయల్స్‌కి రాకపోయినా అతని బౌలింగ్ పర్ఫామెన్స్‌ని, మిగిలిన టీమ్స్ నుంచి ఫీడ్ బ్యాక్‌ని తీసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. శివంగ్ కుమార్‌ని కొనుగోలు చేసింది.
శివంగ్ కుమార్ తండ్రి ప్రవీణ్ కుమార్, బెంగాల్ టీమ్‌కి రంజీ మ్యాచులు ఆడాడు. ప్రస్తుతం రైల్వే అధికారిగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ కుమార్, కొడుకుని సక్సెస్ చేసేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
- రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండర్‌గా...
వాస్తవానికి శివంగ్ కుమార్ రైట్ హ్యాండర్. అయితే టీమ్‌లో రైట్ హ్యాండ్ స్పిన్నర్లు చాలా మంది ఉంటారు. కాబట్టి రైట్ హ్యాండ్ స్పినర్‌గా సక్సెస్ కావడం చాలా కష్టం. దీంతో మాజీ క్రికెటర్ అయిన తండ్రి ప్రవీణ్ కుమార్, కొడుకుని రైట్ హ్యాండ్ బౌలర్ నుంచి లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా మార్చాడు. అయితే ఒక్కసారిగా చేతివాటం మార్చడం వల్ల అది శివంగ్ కుమార్ శరీరంపై, ఆటపై తీవ్ర ప్రభావం చూపించింది.
అండర్ 14 టీమ్‌కి ఎంపిక కాలేకపోయిన శివంగ్ కుమార్, ఆ మనస్థాపంతో క్రికెట్ మానేయాలని అనుకున్నాడు. 5 నెలల పాటు క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు.
- ఎమ్మెస్ ధోనీ బయోపిక్ చూసి..
ఇక క్రికెట్ మానేద్దామని అనుకున్న శివంగ్ కుమార్, ఎమ్మెస్ ధోనీ బయోపిక్ చూసి.. మళ్లీ బాల్ అందుకుని గ్రౌండ్‌లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి అత్యద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపన ఎంట్రీ ఇచ్చేశాడు.
Read more news like this on telugu.timesnownews.com

