Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లక్ష లోపు ధరలో,అధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే...ధరలు,మైలేజ్,ఫీచర్స్

లక్ష లోపు ధరలో,అధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బైక్స్ ఇవే...ధరలు,మైలేజ్,ఫీచర్స్

Times Now Telugu 6 days ago

ఇంధన ధరలు బరమవుతున్న ఈ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లు ప్రజలకు అత్యంత అవసరమైనవిగా మారాయి. రోజువారీ ప్రయాణం చేసే వారికి , ఉద్యోగులు, విద్యార్థులకు 1 లక్ష లోపు ధరలో లభించే బెస్ట్ మైలేజ్ బైక్‌లు సరైన ఎంపిక.

ఈ సెగ్మెంట్ లో Honda , TVS , Hero , Bajaj వంటి ప్రముఖ కంపెనీలు మార్కెట్ లో వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చాయి . కంపెనీ ప్రకారం 65 kmpl నుండి 80 kmpl వరకు మైలేజ్ ఇచ్చే ఈ బైక్ లు తక్కువ నిర్వహణ ఖర్చు, సులభమైన సర్వీస్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం వీటి ప్రత్యేకత. నగరాల్లో ట్రాఫిక్ మధ్య ప్రయాణించేవారికి, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ దూరం వెళ్లేవారికి ఇవి అత్యంత అనుకూలంగా ఉంటాయి. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ బైక్‌లు ఇంధన ఖర్చులను తగ్గించుకోవాలనుకునే వారికి బెస్ట్ .
Hero Splendor Plus XTEC 2.0
ఇది అధిక మైలేజ్ ఇచ్చే బైక్. ఇది 97.2 cc ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ OHC ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ 5.9 kW పవర్‌, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Programmed Fuel Injection సిస్టమ్‌తో ఇది మరింత సమర్థవంతమైన ఇంధన వినియోగాన్ని అందిస్తుంది.4-స్పీడ్ కాన్స్టెంట్ మెష్ గేర్‌బాక్స్ తో ఉంటుంది. బైక్ సుమారు 70 kmpl మైలేజ్ ఇస్తుంది

ఫీచర్స్
Bluetooth కనెక్టివిటీతో కాల్ , SMS అలర్ట్, RTMI , i3S టెక్నాలజీ, LED హెడ్‌ల్యాంప్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, మరియు ప్లష్ సీటు ఉన్నాయి. అదనంగా, ట్యూబ్‌లెస్ టైర్లు, 5-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, హాజర్డ్ లైట్ ఫంక్షన్, స్పేసియస్ యుటిలిటీ కేస్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. బైక్‌లో 9.8 L ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 165 mm గ్రౌండ్ క్లియరెన్స్, 1236 mm వీల్‌బేస్, 112 kg కర్బ్ వెయిట్ ఉన్నాయి. దీని ఎక్స్ షో రూమ్ ధర ₹ 82,651/-
Hero HF Deluxe
ఈ బైక్‌లో 97.2 cc ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ OHC ఇంజిన్ ఉంటుంది . ఇది 5.9 kW పవర్‌, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌ 4-స్పీడ్ కాన్స్టెంట్ మెష్ గేర్‌బాక్స్ తో ఉంటుంది .సుమారు 70 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది

ఫీచర్స్
HF Deluxe కొత్త స్టైలిష్ గ్రాఫిక్స్ మరియు LED హెడ్‌ల్యాంప్ , Xsens స్మార్ట్ సెన్సార్ టెక్నాలజీ ద్వారా బైక్ ఇంధన సామర్థ్యాన్ని పెంచుతుంది. i3S టెక్నాలజీ ట్రాఫిక్‌లో idle సమయంలో ఇంజిన్‌ను ఆఫ్ చేసి ఇంధనాన్ని ఆదా చేస్తుంది.
బైక్‌లో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ ముందు, 2-స్టెప్ అడ్జస్టబుల్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ వెనుక ఉంటాయి . ట్యూబ్‌లెస్ టైర్లు, ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, LED హెడ్‌ల్యాంప్ వంటి ఫీచర్లు రైడింగ్ అనుభవాన్ని మరింత సురక్షితంగా చేస్తాయి.దీని ఎక్స్ షో రూమ్ ధర ₹ 66,547/-
Honda Shine 100
అధిక మైలేజ్ ఇచ్చే బైక్‌గా భారతీయ మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇది 98.98 cc BS-VI OBD2B కంప్లయింట్ ఇంజిన్ తో వస్తుంది. 7.28 bhp పవర్‌ , 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. PGM-FI ఫ్యూయల్ ఇంజెక్షన్ , eSP టెక్నాలజీ మైలేజ్ ఇస్తుంది.4-స్పీడ్ గేర్‌బాక్స్ తో ఉంటుంది.65 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.

ఫీచర్స్
డైమండ్ ఫ్రేమ్, సైడ్ స్టాండ్ ఇంజిన్ ఇన్హిబిటర్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. 9 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, 168 mm గ్రౌండ్ క్లియరెన్స్, 1245 mm వీల్‌బేస్‌తో Shine 100 నగరాల్లో , గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణానికి అనువుగా ఉంటుంది. లాంగ్ సీటు, స్మాల్ టర్నింగ్ రేడియస్, కాంపాక్ట్ డిజైన్ వలన రైడర్ పిలియన్‌కు సౌకర్యవంతమైన ప్రయాణం అందిస్తుంది . CBS బ్రేకింగ్ సిస్టమ్, స్ట్రాంగ్ గ్రాబ్ రైల్, స్టైలిష్ అలాయ్ వీల్స్ ఉంటాయి . దీని ఎక్స్ షో రూమ్ ధర ₹ 66950/-
Bajaj Platina 100
ఇది కూడా అధిక మైలేజ్ ఇచ్చే బైక్‌గా భారతీయ మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇది 102 cc DTS-i ఇంజిన్ తో వస్తుంది. ఇది 6.03 kW (8.2 PS) పవర్‌, 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో, Programmed Fuel Injection వలన మైలేజ్ ఇస్తుంది. 4-స్పీడ్ కాన్స్టెంట్ మెష్ గేర్‌బాక్స్ తో ఉంటుంది.మైలేజ్ 75 kmpl వరకు ఇస్తుంది

ఫీచర్స్
టెక్నాలజీ హైలైట్స్‌లో Comfortec టెక్నాలజీ ప్రధానంగా ఉంటుంది. ఇది లాంగ్ ఫ్రంట్ , రియర్ సస్పెన్షన్ ద్వారా రఫ్ రోడ్లపై కూడా స్మూత్ రైడ్ అందిస్తుంది. LED DRL (Daytime Running Light), ఎలక్ట్రిక్ స్టార్ట్, Wider Footpads, స్టైలిష్ గ్రాఫిక్స్ దీని ప్రత్యేకతలు. సేఫ్టీ కోసం CBS బ్రేకింగ్ సిస్టమ్ , డ్యూరబుల్ ఫ్రేమ్ కూడా అందించబడింది. 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ , తక్కువ బరువు వలన లాంగ్ డ్రైవ్ కి , రోజువారీ ప్రయాణం చేసే వారికి బెస్ట్ గా ఉంటుంది.దీని ఎక్స్ షో రూమ్ ధర 68 623/-
TVS Sport
ఇదికూడా మైలేజ్ ఇచ్చే బైక్‌గా పేరు సంపాదించింది. ఇది 109.7 cc ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 8.29 PS పవర్‌, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.4-స్పీడ్ కాన్స్టెంట్ మెష్ గేర్‌బాక్స్ ఉంటుంది. బైక్ సగటు 75 kmpl వరకు మైలేజ్ ఇస్తుంది.

ఫీచర్స్
Duralife Engine, ET-Fi టెక్నాలజీ, ఎలక్ట్రిక్ స్టార్ట్, 5-Step Adjustable సస్పెన్షన్, , ఎక్స్ట్రా లాంగ్ సీట్ ఉన్నాయి. ప్రీమియం 3D లోగో & గ్రాఫిక్స్ బైక్‌కు ఆకర్షణీయమైన లుక్ ఇస్తాయి. ఈ బైక్ తక్కువ నిర్వహణ ఖర్చు, అధిక మైలేజ్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవంతో రోజువారీ ప్రయాణం చేసే ఉద్యోగులు, విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ దూరం వెళ్లేవారికి సరైన ఎంపికగా నిలుస్తుంది.ధర ఎక్స్ షో రూమ్ ప్రారంభ ధర ₹ 68 100/-

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu