Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
LinkedIn: లింక్డ్‌ఇన్‌లో లేఆఫ్స్...600 మంది ఉద్యోగుల తొలగింపు

LinkedIn: లింక్డ్‌ఇన్‌లో లేఆఫ్స్...600 మంది ఉద్యోగుల తొలగింపు

Times Now Telugu 4 days ago

మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ లింక్డ్‌ఇన్‌ లేఆఫ్స్ ప్రకటించింది. సుమారుగా 600 ఉద్యోగులను తొలగించనున్నారు. న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, జూలై 13 నుండి అమల్లోకి వచ్చేలా 600 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు లింక్డ్ఇన్ అధికారికంగా ప్రకటించింది.

పలు రిపోర్ట్స్ ప్రకారం, లింక్డిన్‌ కంపెనీ సుమారు 606 ఉద్యోగులకు గత వారంలో పర్మెనెంట్ లేఆఫ్స్‌కు సంబంధించి సమచారం అందించింది. కాలిఫోర్నియా కార్యాలయంలో సుమారుగా 350 మంది, ఈ లేఆఫ్స్ వల్ల ప్రభావితం కానున్నారు. అదే నగరంలో నివసిస్తు రిమోట్ వర్క్ చేస్తున్న 66 మందిని కూడా తొలగించనున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో 100 మంది ఉద్యోగులు, సన్నీవేల్‌లో 59 మంది, కార్పింటెరియాలో 21 మంది ఉద్యోగులు ఈ లేఆఫ్స్ వల్ల ప్రభావితం కానున్నారు.

కంపెనీ పనిచేసే విధానాన్ని పునరావిష్కరించుకోవాలని , అలాగే పెట్టుబడులను మౌలిక సదుపాయాలు , దీర్ఘకాలిక ప్రాధాన్యతల వైపు మళ్లించుకోవాలని లింక్డ్ఇన్ సీఈఓ డేనియల్ షాపెరో ఒక ఇంటర్నల్ మెమోలో పేర్కొన్న తర్వాత ఈ లేఆఫ్స్ విషయం వెలువడింది.

మార్కెటింగ్, ఇంజనీరింగ్, ప్రొడక్ట్ , ఇతర వ్యాపార విభాగాలలో ఉద్యోగాలను తగ్గించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. పలు రిపోర్ట్స్ ప్రకారం, లింక్డ్ఇన్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్, వెండర్ ఎక్స్‌పెన్సెస్ , కస్టమర్ ఈవెంట్‌స్,ఆఫీస్ స్పేస్ కోసం చేసే ఖర్చులను కూడా కంపెనీ పూర్తిగా తగ్గిస్తోంది. ఇటీవల కంపెనీ ప్రతీ ఏటా 12 శాతం వృద్ధి కనబరుస్తుందని మూడో త్రైమాసికంలో పేర్కొన్నప్పటికీ ఉద్యోగుల తొలగింపు జరుగుతుంది. లింక్‌డిన్ మాతృసంస్థ మైక్రోసాప్ట్ ఇప్పటికే కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు వాలంటరీ ఎగ్జిట్ ప్యాకేజీని ప్రకటించింది. దీని ద్వారా 1,25,000 ఉన్న ఉద్యోగుల్లో 7 శాతం, అంటే సమారుగా 8,750 మందిపై ప్రభావం ఉండే అవకాశం ఉంది.

పలు టెక్ దిగ్గజ కంపెనీలు కూడా ఇటీవల లేఆఫ్స్ ప్రకటించాయి. గూగుల్, అమెజాన్, మెటా, ఐబీఎమ్ కూడా ఇటీవల ఉద్యోగులను తొలగించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పెట్టుబడులు నేపథ్యంలో వర్క్‌ప్లేస్‌లో కీలక మార్పులు చేసుకుంటున్నట్లు తెలిపారు.

టీమ్స్ రీఆర్గనైజ్ చేసేందుకు, బిజినెస్ వృద్ధి చెందుతున్న రంగాలపై ఉద్యోగులను కేంద్రీకరించడానికి లింక్‌డిన్ ఉద్యోగుల తొలగింపును చేపట్టనున్నట్లు ఇటీవల రాయిటర్స్ ఓ కథనంలో పేర్కొంది.


మెటాలో 8 వేల మంది ఉద్యోగుల తొలగింపు!
ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌ బుక్‌ మాతృసంస్థ మెటా మరోసారి భారీ స్థాయిలో లేఆఫ్స్‌కు సిద్దమైనట్లు సమాచారం. ఈ నెల 20న సంస్థలో పనిచేస్తున్న సుమారు 8 వేల మందికి పైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. మొత్తం కంపెనీలో 10 శాతం ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ఉద్యోగాల తొలగింపుతో పాటు సంస్థలోని మరో 7 వేల మంది సిబ్బందిని కొత్త బాధ్యతల్లోకి మార్చే అవకాశం ఉంది. మెటా కంపెనీలో ప్రస్తుతం సుమారుగా 78 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

ఏఐతో ప్రొడక్టివిటీ పెంచుకోవాలి, ఉద్యోగులను తొలగించకూడదు- గూగుల్ డీప్‌మైండ్ సీఈవో
ఉద్యోగుల తొలగింపు విషయంపై గూగుల్ డీప్‌మైండ్ సీఈవో డెమిస్ హిస్సాబిక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉత్పత్తి పెంచుకోవడానికి వాడుకోవాలి కానీ, ఉద్యోగుల తొలగింపు కోసం కాదని అన్నారు. ముందు చూపు లేకపోవడం వలన పలు టెక్ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయని వెల్లడించారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu