Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంచు మనోజ్ దంపతుల కీలక నిర్ణయం... ఐక్య పేరుతో కొత్త ప్రయాణం

మంచు మనోజ్ దంపతుల కీలక నిర్ణయం... ఐక్య పేరుతో కొత్త ప్రయాణం

Times Now Telugu 1 week ago

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి చాలా మందికి తెలుసు. టాలీవుడ్‌ యాక్టర్లలో మంచు మనోజ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన మంచు మనోజ్ ఇండస్ట్రీలో రాణించారు.

పలు సినిమాలు హిట్ అయ్యాయి. నటుడిగా తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నారు. అనంతరం కొంత గ్యాప్ ఇచ్చారు. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు మంచు మనోజ్. ఒకవైపు సినిమాల్లో బిజీబిజీగా ఉంటూనే మరోవైపు సామాజిక సేవలో కూడా తరించాలనే నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే పలువురికి సేవ చేస్తూ అందరికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు మంచు మనోజ్. అయితే మంచు మనోజ్ సతీమణి మౌనిక రెడ్డి ట్రస్ట్ పెట్టాలని కోరడంతో మంచు మనోజ్ ఐక్య ధైర్య సేన సమితి పేరుతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు.

ఐక్య ధైర్య సేన సమితి ట్రస్ట్ ప్రారంభం

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ సామాజిక సేవలో తనవంతు బాధ్యతగా ముందుండే వారిలో టాప్‌లో ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మంచు మనోజ్ తన వ్యక్తిగతంగా ఎందరికో సహాయసహకారాలు అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సామాజిక సేవలో భాగంగా మరో కొత్త ప్రయాణం మెదలు పెట్టారు. మంచు మనోజ్, అతని సతీమణి భూమా మౌనిక రెడ్డి ఐక్య ధైర్య సేన సమితి పేరిట కొత్త ట్రస్ట్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తొలి అడుగుగా ఐదుగురు పిల్లలను దత్తత తీసుకొని, వారిని చదివిస్తానని మంచు మనోజ్ ప్రకటించారు.ఐక్య ధైర్య సేన సమితి ట్రస్ట్ పేరుతో మరింత మందికి సేవ చేస్తానని ప్రకటించారు.

10 మంది కోసం నిలబడటం బలంగా నేర్చుకున్నాం
ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ....ఎప్పటి నుంచో మేం సేవా కార్యక్రమాలంటే ముందుంటాం. 10 మందికి ఎప్పుడు ఏ అవసరమున్నా ముందుంటాం. నేను కానీ నా సతీమణి మౌనిక కానీ మా చిన్నప్పటి నుంచి మా పెద్దల నుంచి 10 మంది కోసం నిలబడటం బలంగా నేర్చుకున్నాం అని అన్నారు. ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేశాం. కానీ అదంతా ఒక ఆర్గనైజేషన్ కింద ఒక ట్రస్ట్‌కింద ఫాం చేసి మా ఐడియాలజీ పది మందికి సేవ చేయాలని ముందుకొచ్చే వారికి ఒక మంచి ప్లాట్‌ఫాం కావాలని ఈ రోజు ఐక్య ధైర్య సేనే సమితి మొదలుపెట్టడం జరిగింది అని మంచు మనోజ్ వెల్లడించారు.

కోట్లాది మందికి ట్రస్ట్ ఉపయోగపడినప్పుడే సక్సెస్ అయినట్లు
ఐక్య ధైర్య సేన సమితి ట్రస్ట్ ఐడియా తన సతీమణి మౌనికా రెడ్డిది అని మంచు మనోజ్ వెల్లడించారు.ఎప్పుడూ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి యూనిటీగా ప్లాన్ చేద్దామని దీన్ని ముందుకు తీసుకొస్తున్నాం అని చెప్పుకొచ్చారు. ఈ ట్రస్ట్ ప్రారంభంరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టారు. అలాగే తాము ఐదుగురు పిల్లలను దత్తత తీసుకొని వాళ్లను చదివిద్దాం అనుకుంటున్నాం అని ప్రకటించారు. అది ఇక్కడితో ఆగదు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ జిల్లాలో, ప్రతీ టౌన్‌, ఊరిలో, ఏరియాలో ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాం అని మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. మాకు జీవితంలో ఏదైనా గెలుపు ఉందంటే ఈ ఆర్గనైజేషన్‌. ఈ ట్రస్ట్‌ ఎన్నో లక్షలమందికి, కోట్ల మందికి ఉపయోగపడిన రోజు జీవితంలో మేంసక్సెస్ అయినట్టు.. అప్పటివరకు కాదు అంటూ హీరో మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu