Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మే 2026 లో లక్షకు పైగా అమ్మకాలు జరిపిన రాయల్ ఎన్‌ఫీల్డ్...క్లాసిక్ 350, హంటర్ 350 సహా టాప్ లో నిలిచిన మోడల్స్ ఇవే

మే 2026 లో లక్షకు పైగా అమ్మకాలు జరిపిన రాయల్ ఎన్‌ఫీల్డ్...క్లాసిక్ 350, హంటర్ 350 సహా టాప్ లో నిలిచిన మోడల్స్ ఇవే

Times Now Telugu 1 week ago

రాయల్ ఎన్‌ఫీల్డ్ మే నెలలో మంచి అమ్మకాలను సాధించింది. 350 cc మోడళ్లకు వినియోగదారుల నుండి వచ్చిన మంచి డిమాండ్ తో కంపెనీ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.

దేశీయ మార్కెట్లో డిమాండ్ పెరగడం వల్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ తన స్థిరమైన స్థానాన్ని బలపరచుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో కొంత తగ్గుదల ఉన్నప్పటికీ భారతీయ వినియోగదారుల విశ్వాసం బ్రాండ్‌ను ముందుకు నడిపించింది. ఇటీవలనే కొత్త బుల్లెట్ 650 మోడల్‌ను లాంచ్ చేసారు.ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త తయారీ ప్లాంట్‌ను ప్రకటించడం ద్వారా కంపెనీ దీర్ఘకాల వృద్ధి లక్ష్యాలను స్పష్టంగా తెలియజేసింది. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను కేవలం ఒక మోటార్‌సైకిల్ బ్రాండ్‌గా కాకుండా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉంటూ ప్రత్యేకతను నిలబెట్టుకుంది.
మే 2026లో అమ్మకాలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ మే 2026లో కంపెనీ మొత్తం 1,03,231 మోటార్‌సైకిళ్ల అమ్మకాలు జరిపింది . ఇది మే 2025లో అమ్మిన 89,429 యూనిట్లతో పోలిస్తే 15% ఎక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి ఒక లక్షకు పైగా అమ్మకాలు జరగడం ప్రత్యేకత. దేశీయ మార్కెట్లో అమ్మకాలు 24% పెరిగి 94,115 యూనిట్లకు చేరాయి. ఎగుమతులు మాత్రం 33% తగ్గి 9,116 యూనిట్లు మాత్రమే నమోదయ్యాయి.

దేశీయ అమ్మకాలు
రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్‌లో డిమాండ్ స్పష్టంగా తెలుస్తుంది . మే 2026లో 94,115 యూనిట్ల అమ్మకాలు జరపగా మే 2025లో 75,820 యూనిట్ల అమ్మకాలు జరిపింది . ఇది 24% వృద్ధి గా ఉంది. 2026 సంవత్సరం ప్రారంభం నుండి ఏప్రిల్, మే నెలలలో కలిపి దేశీయ అమ్మకాలు సుమారు 1.98 లక్ష యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే రెండు నెలల్లో సుమారు 1.52 లక్ష యూనిట్లుగా ఉన్నాయి . ఈ రెండు వరుస నెలల్లో 31% పెరుగుదల నమోదైంది. ఈ డిమాండ్ ఒక్కసారిగా గ కాకుండా స్థిరంగా కొనసాగుతున్నది.

అత్యధికంగా డిమాండ్ ఉన్న మోడల్స్
రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలలో 350cc మోడళ్లు ముఖ్య పాత్ర పోషించాయి . క్లాసిక్ 350, హంటర్ 350, బుల్లెట్ 350, గోవన్ క్లాసిక్ 350 అన్ని కలిపి మే నెలలో 90,784 యూనిట్ల అమ్మకాలు కొనసాగించాయి . గత సంవత్సరం ఇదే నెలలో అది 76,492 యూనిట్లు మాత్రమే.ఉన్నాయి. గత సంవత్సరం తో పోలిస్తే 19% వృద్ధి. భారతీయ వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే మోడళ్లు ఇవే కావడం వల్ల ఈ సెగ్మెంట్ మంచి డిమాండ్ కొనసాగిస్తుంది.

ప్రీమియం సెగ్మెంట్ లో 650 ట్విన్స్, హిమాలయన్ 450, గెరిల్లా 450 మోడల్స్ అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది . అమ్మకాలు 12,447 యూనిట్లు ఉండగా గత సంవత్సరం 12,937 యూనిట్ల తో 4% తగ్గుదలగా ఉంది . ఇది చిన్న తగ్గుదల అయినప్పటికీ గత రెండు సంవత్సరాలుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 ప్లాట్‌ఫారంపై పెట్టిన పెట్టుబడిని చూసుకుంటే గమనించదగ్గ అంశం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎగుమతులు
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎగుమతుల సంఖ్య మే 2026లో గణనీయంగా తగ్గింది. ఈ నెలలో మొత్తం 9,116 యూనిట్లు ఎగుమతి చేయగా మే 2025లో 13,609 యూనిట్లుగా ఉన్నాయి . అంటే 33% తగ్గుదలగా కనిపిస్తుంది . 2026 సంవత్సరం ప్రారంభం నుండి ఏప్రిల్, మే నెలలలో కలిపి ఎగుమతులు 18,151 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో అది 24,166 యూనిట్లతో పోలిస్తే 25% తగ్గుదల.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu