Dailyhunt
మొన్న కెఎల్ రాహుల్, ఇప్పుడు రిషబ్ పంత్... గ్రౌండ్‌లోనే సీరియస్ అయిన సంజీవ్ గోయెంకా! సోషల్ మీడియాలో ట్రోల్స్..

మొన్న కెఎల్ రాహుల్, ఇప్పుడు రిషబ్ పంత్... గ్రౌండ్‌లోనే సీరియస్ అయిన సంజీవ్ గోయెంకా! సోషల్ మీడియాలో ట్రోల్స్..

Times Now Telugu 2 weeks ago

{జీతం ఇచ్చినంత మాత్రం ఏ ఉద్యోగిని కూడా అందరి ముందు తిట్టి, అవమానించే హక్కు ఏ యజమానికి ఉండదు.లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా, తన టీమ్ ప్లేయర్లతో వ్యవహరించే తీరు, మొదటి నుంచి వివాదస్పదం అవుతూనే ఉంది.

రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ ఉన్నప్పుడు ధోనీని కెప్టెన్సీ నుంచి తప్పించి, స్టీవ్ స్మిత్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించాడు సంజీవ్ గోయెంకా. ఈ సంచలన నిర్ణయంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. 2024 సీజన్‌లో కెఎల్ రాహుల్‌ని తిట్టి, వివాదాల్లో నిలిచాడు సంజీవ్ గోయెంకా. అయినా అతని పద్ధతి ఏ మాత్రం మారలేదు. తాజాగా ఐపీఎల్ 2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌పై సీరియస్ అయ్యాడు సంజీవ్ గోయెంకా.

లక్నోలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 18.4 ఓవర్లలో 141 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సమీర్ రిజ్వీ సెన్సేషనల్ హాఫ్ సెంచరీ కారణంగా ఈ లక్ష్యాన్ని 17.1 ఓవర్లలోనే ఛేదించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆరంభంలో లక్నో బౌలర్లు వెంటవెంటనే 4 వికెట్లు తీశారు. గతంలో లక్నోకి కెప్టెన్సీ చేసిన కెఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. పథుమ్ నిశ్శంక 1, నితీశ్ రాణా 15 పరుగులు చేయగా కెప్టెన్ అక్షర్ పటేల్ డకౌట్ అయ్యాడు. అయితే సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ కలిసి శతాధిక భాగస్వామ్యంతో మ్యాచ్‌ని ముగించారు.

  • రిషబ్ పంత్‌తో సీరియస్ చర్చలు..

ఈ ఓటమి తర్వాత ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్‌తో గ్రౌండ్‌లో సీరియస్‌తో చర్చించడం కెమెరాల్లో కనిపించింది. వాళ్లేం మాట్లాడుకున్నారో వినిపించకపోయినా సంజీవ్ గోయెంకా, రిషబ్ పంత్‌ని చూపిస్తూ ఏదో సీరియస్‌గా చెప్పడం, దానికి అతను ముఖం చిన్నబుచ్చుకోవడం కనిపించింది. టీమ్ పర్ఫామెన్స్ కారణంగా సంజీవ్ గోయెంకాకి కోపం రావడంలో తప్పు లేదు, కానీ ఇలా గ్రౌండ్‌లోకి వచ్చి మరీ ఇంటర్నేషనల్ క్రికెటర్‌ని అవమానించడం మాత్రం కరెక్ట్ కాదని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు..

రూ.27 కోట్లు పెట్టి కొనుగోలు చేశాం కదా అని.. ఎన్ని తిట్టినా భరించాలని అనుకునే కార్పరేట్ పద్ధతి, జెంటిల్మెన్ గేమ్ క్రికెట్‌కి సెట్ కాదనే విషయాన్ని సంజీవ్ గోయెంకా గ్రహించాలని సూచిస్తున్నారు.

  • గతంలో కెఎల్ రాహుల్‌తో కూడా...

2024 ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 10 వికెట్ల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు, 165 స్కోరు చేసింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పిచ్చి కొట్టుడుకి ఈ లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఊదేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. అయితే ఈ మ్యాచ్ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా, గ్రౌండ్‌లో అప్పటి లక్నో టీమ్ కెప్టెన్ కెఎల్ రాహుల్‌ని తిట్టడం సంచలనం క్రియేట్ చేసింది.
 ఈ సంఘటన తర్వాత క్రికెట్ ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు అందరూ కూడా సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. డబ్బులు పెట్టినంత మాత్రాన, అంతర్జాతీయ క్రికెట్ ఆడే ప్లేయర్‌ని ఇలా గ్రౌండ్‌లో ప్రేక్షకులందరి ముందు ఇలా చివాట్లు పెట్టి, అవమానించడం అస్సలు కరెక్ట్ కాదని విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో బ్యాడ్ అయిపోవడంతో కెఎల్ రాహుల్‌ని ఇంటికి పిలిచి, డిన్నర్ ఏర్పాటు చేసి.. 'సారీ' చెప్పాడు సంజీవ్ గోయెంకా. అయితే అందరి ముందు తిట్టి, ప్రైవేటుగా సారీ చెబితే చెల్లిపోతుందా? అందుకే ఐపీఎల్ 2025 మెగా వేలంల లక్నో సూపర్ జెయింట్స్‌ని వీడి, ఢిల్లీ క్యాపిటల్స్‌కి వచ్చేశాడు కెఎల్ రాహుల్.

ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కెప్టెన్సీ ఆఫర్ చేసినా గత అనుభవం కారణంగా సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడలేదు కెఎల్ రాహుల్. 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 57 పరుగులు చేసి, ఢిల్లీ క్యాపిటల్స్‌ని గెలిపించాడు. మ్యాచ్ అనంతరం సంజీవ్ గోయెంకా, అభినందించడానికి, మాట్లాడడానికి ప్రయత్నించినా.. కెఎల్ రాహుల్ ముఖం తిప్పేసుకోవడం, పట్టించుకోకపోవడం కెమెరాల్లో కనిపించింది.

ఈసారి సంజీవ్ గోయెంకా తీరు మార్చుకోకపోతే రిషబ్ పంత్ కూడా లక్నో సూపర్ జెయింట్స్ నుంచి జంప్ కావడం ఖాయమంటూ కామెంట్లు చేస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu