Dailyhunt
నాసిక్ జిల్లాలో బావిలో పడ్డ కారు... ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి, అసలేం జరిగిందంటే

నాసిక్ జిల్లాలో బావిలో పడ్డ కారు... ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి, అసలేం జరిగిందంటే

Times Now Telugu 1 week ago

హారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఒక కారు బావిలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మరణించారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు ఉన్నారు.

వీరంతా ఓ కార్యక్రమానికి హాజరై తిరిగివస్తుండగా శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు... శివాజీనగర్‌లోని రాజే బాంకెట్ హాల్‌లో వడ్జే క్లాసెస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దిండోరి తాలూకాలో ఇండోర్ గ్రామం నుంచి సునీల్ దత్తాత్రేయ దర్గుడే కుటుంబం అక్కడికి వచ్చింది. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సునీల్ దత్తు దర్గుడే కుటుంబం మారుతి ఎక్స్ఎల్ కారులో ఇంటికి తిరిగి బయలుదేరింది.

అయితే కారు నడుపుతున్న వ్యక్తి వాహనంపై నియంత్రణ కోల్పోయారు. దీంతో శివాజీనగర్ ప్రాంతంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు... అక్కడున్న బావిలో పడిపోయినట్టుగా తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే... ఘటనా స్థలం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే, తహసీల్దార్ ముఖేష్ కాంబ్లే, పోలీస్ ఇన్‌స్పెక్టర్ భగవాన్ మాథురే, చీఫ్ ఆఫీసర్ సందీప్ చౌదరి, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక దళం , విపత్తు నిర్వహణ బృందం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్థానికులు, అధికారులు, రెస్క్యూ బృందాలు ప్రమాద స్థంలో సహాయక చర్యలు చేపట్టారు. అయితే బావి నీటితో నిండి ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. చివరకు అర్ధరాత్రి సమయంలో రెండు క్రేన్‌ల సహాయంతో ఆ కారును బావిలోంచి వెలికితీశారు. సహాయక చర్యల సమయంలో కారులో నుంచి ఎనిమిది మంది మృతుల మృతదేహాలను వెలికితీశారు. ఆ తర్వాత బావిలో గాలింపు చేపట్టి ఒక బాలిక మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మరణించినట్టుగా నిర్దారణకు వ్చారు. అనంతరం మృతదేహాలనుదిండోరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

మృతులను సునీల్ దత్తాత్రేయ దర్గోడే (32), రేష్మా సునీల్ దర్గోడే (27), రాఖీ అలియాస్ గుణవంతి (10), మాధురి అనిల్ దర్గోడే (13), శ్రావణి అనిల్ దర్గోడే (11), ఆశా అనిల్ దర్గోడే (32), శ్రేయష్ అనిల్ దర్గోడే (11), సృష్టి అనిల్ దర్గోడే (14), సమృద్ధి రాజేష్ దర్గోడే (7) గా గుర్తించారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu