తెలుగుదేశం పార్టీ అత్యంత కన్నుల పండువగా నిర్వహించే కార్యక్రమం మహానాడు. ఈ మహానాడు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఒక వేడుకలా జరుపుకుంటారు.
ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని నిర్వహించే ఈ వేడుక అభిమానులకు ఒక పండుగ వాతావరణం అనే చెప్పాలి. ఈ మహానాడును ఈ ఏడాది మరింత జోష్‌లో నిర్వహించుకోవాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నో విజయాలను సాధించింది. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రకటించడం...రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడం ఒక విజయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఏపీకి భారీగా పెట్టుడులు తరలిరావడం వంటి గుడ్‌న్యూస్‌లతో టీడీపీ జోష్‌లో నెలకొంది. అందుకే ఈ ఏడాది నిర్వహించే మహానాడు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇకపోతే నెల్లూరు జిల్లాలో ఈ ఏడాది మహానాడును అత్యంత వైభవంగా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
నెల్లూరులో టీడీపీ మహానాడు
నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ప్రతి ఏడాది తెలుగు తమ్ముళ్లు అత్యంత వైభవంగా నిర్వహించే మహానాడు ఈసారి మరింత ఘనంగా, చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు టీడీపీ సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. ఈ నేపథ్యంలో మహానాడు 2026 నిర్వహణకు అనువైన వేదిక ఎంపిక కోసం కసరత్తు చేస్తోంది. వాస్తు అనుకూలత, విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లు, లక్షలాది మంది కార్యకర్తలు సౌకర్యవంతంగా పాల్గొనే అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి స్థలాన్ని సమగ్రంగా పరిశీలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత మహానాడును ఉత్తరాంధ్రలో నిర్వహించాలని భావించినప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ పర్యటన నేపథ్యంలో అక్కడ విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి నెల్లూరులో మహానాడు పసుపు పండుగను నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో వేదిక ఖరారు
ఇకపోతే ఈ ఏడాది నెల్లూరులో మహనాడును నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరులో మహానాడు నిర్వహించే అంశంపై టీడీపీ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే పలు ప్రాంతాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతోపాటు టీడీపీ శ్రేణులు పరిశీలించే అవకాశం ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించి వేదిక ఖరారు చేయనున్నారు. మౌలిక వసతులు, విస్తరణ అవకాశాలు, రవాణా అనుసంధానంకు అనుకూలంగా ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.
మహానాడు ఆత్మగౌరవ సభ
ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి మహానాడు ఆత్మగౌరవ సభ. పార్టీ ప్రతిష్టకు తగ్గట్టుగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా నిలిచే విధంగా మహానాడు 2026ను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపడుతున్నాం అని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వం, యువతిని ఆకర్షించేలా పార్టీని ముందుకు తీసుకెళ్తున్న మంత్రి నారా లోకేశ్ కార్యచరణతో మహానాడు మరింత వైభవంగా కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించబడుతుందని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అన్ని అంశాలను సమీక్షించి తగిన వేదికను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. మహానాడు 2026ను పార్టీ చరిత్రలో మరో మైలురాయిగా నిలిపే దిశగా కార్యకర్తలందరూ సమన్వయంతో ముందుకు సాగాలని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇకపోతే తొలుత టీడీపీ 44వ మహానాడు వేడుకలను శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని తలపెట్టినప్పటికీ ప్రధాని నరేంద్రమోడీ పర్యటనతోపాటు పలు అనివార్య కారణాలతో వేదిక మారింది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాకు మారింది.
Read more news like this on telugu.timesnownews.com

