Dailyhunt
పశ్చిమబెంగాల్‌ రాజకీయాల్లో సంచలనం: సీఎం మమతా బెనర్జీ ఘోర ఓటమి... రెండోసారి సువేందు అధికారి చేతిలో పరాజయం

పశ్చిమబెంగాల్‌ రాజకీయాల్లో సంచలనం: సీఎం మమతా బెనర్జీ ఘోర ఓటమి... రెండోసారి సువేందు అధికారి చేతిలో పరాజయం

Times Now Telugu 2 weeks ago

శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సంచలన పరిణామాలు వెలువడ్డాయి. పశ్చిమబెంగాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొంది ముఖ్యమంత్రి పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ అధికారానికి బ్రేక్ వేసిన ఓటర్లు ఈసారి బీజేపీకి పట్టంకట్టారు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన సొంత కోట అయిన భవానీపూర్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. బీజేపీ అగ్రనేత సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీ ఘోరంగా ఓటమి పాలయ్యారు. దీదీపై సువేందు అధికారి మమతా బనర్జీపై రెండోసారి గెలిచినట్లు అయ్యింది. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమత బెనర్జీ పై సువేందు విజయం సాధించి చరిత్ర సృష్టించగా మళ్లీ ఇప్పుడు అది భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రుజువు అయ్యింది.కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి భవానీపూర్‌పై ఉత్కంఠ పోరు నడిచింది. హోరాహోరీగా సాగిన ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీని సువేందు అధికారి ఓడించారు.

ఉత్కంఠపోరులో సువేందు గెలుపు

పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. మమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్‌లో ఓడిపోయారు.బీజేపీ కీలక నేత సువేందు అధికారి వెస్ట్ బెంగాల్‌లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. నందిగ్రామ్, భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఇప్పటికే నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సువేందు అధికారి గెలుపొందారు. అయితే భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గట్టి పోటీ నెలకొంది.రౌండ్ రౌండ్‌కి ఉత్కంఠ భరితంగా రిజల్ట్స్ వచ్చాయి. ఒకానొక దశలో మమతా బెనర్జీ విజయం సాధిస్తారని భావించారు. అయితే అనూహ్యంగా మళ్లీ సువేందు అధికారి మళ్లీ పుంజుకున్నారు.చివరికి కౌంటింగ్ పూర్తయ్యే సరికి సువేందు అధికారి విజయం సాధించారు. దీంతో మమతా బెనర్జీ ఓడిపోయారని అధికారులు ప్రకటించారు.

బీజేపీ వేవ్‌లో కొట్టుకుపోయిన దీదీ

పశ్చిమబెంగాల్‌లో బీజేపీ వేవ్ నడుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చావుతప్పి కన్నులొట్టబోయింది. పోనీ ప్రతిపక్షంతోనైనా సరిపెట్టుకుని ప్రతిపక్ష నేతగా కొనసాగుదాం అనుకుని భావించిన మమతా బెనర్జీ ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. బీజేపీ వేవ్‌లో చివరికి టీఎంసీ అధినేత, సీఎం మమతా బెనర్జీ సైతం కొట్టుకుపోయారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓడిపోవడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అంతేకాదు ఆ పార్టీ శ్రేణులు సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు.

దీదీని రెండోసారి ఓడించిన సువేందు అధికారి
ఇకపోతే సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించి రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో జెయింట్ కిల్లర్‌గా మారారు. మమతా బెనర్జీని ఓడించడం సువేందు అధికారికి ఇదేమీ కొత్తకాదు. గతంలో నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మమతా బెనర్జీని తొలిసారిగా ఓడించారు. తాజాగా భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండోసారి ఓడించారు. దశాబ్దాలుగా మమతా బెనర్జీకి కంచుకోటగా ఉన్న భవానీపూర్‌లో బీజేపీ జెండా ఎగురవేయడం విశేషం. ఈ ఫలితంతో బెంగాల్ రాజకీయాల్లో మమతకు ధీటైన ప్రత్యర్థి తానేనని సువేందు అధికారి మరోసారి నిరూపించుకున్నట్లు అయ్యింది. తాజాగా సువేందు అధికారి తన రాజకీయ జీవితంలో మరో మైలురాయిని అధిగమించినట్లు అయ్యింది.అంతేకాదు తాజా ఫలితాలతో పశ్చిమ బెంగాల్ బీజేపీలో తిరుగులేని శక్తిగా సువేందే అధికారి అవతరించారు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu