Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు... దేశవ్యాప్తంగా నేడు గిగ్ వర్కర్ల సమ్మె!

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు... దేశవ్యాప్తంగా నేడు గిగ్ వర్కర్ల సమ్మె!

Times Now Telugu 1 week ago

పెట్రోల్, డీజీల్ ధరల పెంపు నేపథ్యంలో గిగ్ వర్కర్లు దేశపవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. శనివారం రోజున మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యాప్ బేస్డ్ డ్రైవర్స్, డెలివరీ వర్క్సర్స్ ఈ సమ్మె చేస్తున్నారు.

ఇంధన ధరలు పెరగడం, పేమెంట్ రేట్స్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది.

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఎక్కువ గంటలు పనిచేస్తున్నప్పటికీ తగినంత సంపాదన పొందలేకపోతున్నామని చెబుతూ, సమ్మెకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా యాప్ బేస్డ్ డ్రైవర్స్, డెలివరీ వర్కర్స్ ఈ బంద్‌లో పాల్గొనాలని గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ సర్వీసెస్ వర్కర్స్ యూనియన్ (GIPSWU) కార్మికులకు విజ్ఞప్తి చేసింది.

GIPSWU యూనియన్ ఈ మేరకు విషయాన్ని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. " ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో సరైన పేమెంట్స్ లేకపోవడం వలన నిరసనగా, దేశవ్యాప్తంగా ఉన్న గిగ్, ప్లాట్‌ఫారమ్ కార్మికులు రేపు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు యాప్ ఆధారిత సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని GIPSWU విజ్ఞప్తి చేస్తోంది." అంటూ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.

గిగ్ వర్కర్స్ డిమాండ్స్ ఇవే!

దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3 చొప్పున పెంచిన నేపథ్యంలో గిగ్ వర్కర్లు ఈ సమ్మెకు పిలుపునిచ్చారు.

పశ్చిమాసియాలో నెలకొన్న సంఘర్షణల కారణంగా హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో చాలా దేశాలు ఇప్పటికే ఇంధన ధరలు పెంచాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలపై భారం పెరుగుతున్న నేపథ్యంలో ఇండియాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

పెరిగిన ఇంధన ధరలు 2026, మే 15 ఉదయం 6 గంటల నుండి అమల్లోకి వచ్చింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్ నగరంలో కూడా పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకారం... హైదరాబాద్‌లో మే 15న డీజిల్ ధర లీటర్‌రూ. 98.96, పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 110.85గా ఉంది.

మీ ప్రాంతంలో కచ్చితమైన పెట్రోల్, డీజిల్ ధరలను సులభంగా ఎస్ఎమ్ఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వైబ్‌సైట్‌ ప్రకారం, మీ ప్రాంతంలో ఇంధన ధరలు తెలుసుకునేందుకు మీ మొబైల్ నంబర్ నుండి ఎస్ఎమ్ఎస్ చేయాల్సి ఉంటుంది.
"RSP పెట్రోల్ పంప్ డీలర్ కోడ్" SMS ఫార్మాట్‌లో ఈ నంబర్‌కు 92249 92249 కు మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఉదాహకరణకు హైదరాబాద్‌ నగరంలో పెట్రోల్, డీజిల్ ధరలు తెలుసుకోవాలంటే "RSP 134483" అనే సందేశాన్ని 92249 92249 నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ చేయాలి. దేశవ్యాప్తంగా మొత్తం 39 ప్రాంతాల డీలర్ కోడ్స్‌ వివరాలు ఇండియన్ ఆయిల్ వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాల డీలర్ కోడ్స్ ....హైదరాబాద్ - RSP 134483, విశాఖ పట్నం- RSP 127290, విజయవాడ - RSP 127611

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu