Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోక్సో కేసు... పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్

పోక్సో కేసు... పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్

Times Now Telugu 1 week ago

బండి సాయి భగీరథ్‌పై పోక్సో నమోదు కావడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ జరుపుతుంది.

అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బండి భగీరథ్ పేట్‌బషీరాబాద్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పేట్‌బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన పోక్సో కేసులో లొంగిపోయేందుక బండి భగీరథ్‌ నేరుగా పోలీసు స్టేషన్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కేసులో అరెస్ట్ నుంచి రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్‌కు నిరాశే ఎదురైంది. ఇక, బండి భగీరథ్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై కోర్టు మే 21న తీర్పు వెలువరించనుంది.

మరోవైపు ఇప్పటికే సిట్ అధికారులు బండి భగీరథ్‌కు విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేయగా... అతడు విచారణకు హాజరుకాలేదు. అంతేకాకుండా తనకు రెండు రోజుల సమయం కావాలని కోరుతూ సిట్‌కు లేఖ రాశారు. అయితే ఆ రెండు రోజుల సమయం కూడా ముగిసిపోయింది. దీంతో ప్రస్తుతం బండి భగీరథ్ కోసం పోలీసు బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ సమయంలో భగీరథ్ శనివారం సాయంత్రం నేరుగా వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu