Dailyhunt
ప్రజలు ఎక్కువగా కొన్న టాటా కార్లు ఇవే...ఇయర్ ఎండ్ సేల్స్ లో టాటా ఎన్నో స్థానం లో  ఉందంటే

ప్రజలు ఎక్కువగా కొన్న టాటా కార్లు ఇవే...ఇయర్ ఎండ్ సేల్స్ లో టాటా ఎన్నో స్థానం లో ఉందంటే

Times Now Telugu 2 weeks ago

మార్చి 2026లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 66,971 యూనిట్లతో గత ఏడాదితో పోలిస్తే 29% వృద్ధి సాధించాయి. ఈ విజయానికి ప్రధాన కారణం రెండు ప్రధాన SUVలు.

ఇవి మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో నిలిచాయి. FY26లో టాటా మోటార్స్ మొత్తం 6.42 లక్షల యూనిట్ల వార్షిక విక్రయాలతో రికార్డు స్థాయిని నమోదు చేసింది. SUVలతో పాటు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), CNG మోడల్స్ కూడా మంచి అమ్మకాలు కొనసాగించాయి . EV విక్రయాలు 92,000 యూనిట్లకు చేరి 43% వృద్ధి సాధించగా, CNG మోడళ్లు 1.72 లక్షల యూనిట్లకు చేరి 24% పెరిగాయి. ఈ విభిన్న వాహనాల విజయవంతమైన అమ్మకాలు టాటా మోటార్స్‌ను భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో రెండవ స్థానంలో నిలిపింది.
మార్చి 2026లో టాటా కార్ల అమ్మకాలు
టాటా మోటార్స్ FY26ను సుమారు 6.42 లక్షల యూనిట్ల అత్యధిక వార్షిక అమ్మకాలతో 15% వృద్ధి సాధించింది . మార్కెట్ లో మంచి స్థానంలో నిలిచింది . సంవత్సరంలోని రెండవార్థంలోనే ఎక్కువ వృద్ధి అంటే 28% సాధించింది.

అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్
ఈ అమ్మకాల వృద్ధిని సాధించడానికి ప్రధాన మోడల్స్ టాటా నెక్సాన్ , టాటా పంచ్ . ఈ రెండు SUVలు ఇప్పటికీ మార్కెట్ లో అత్యధికంగా అమ్ముడవుతున్న వాహనాల జాబితాలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సంవత్సరంలోని సెకండ్ హాఫ్ ఇయర్ లో నెక్సాన్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది .

EV & CNG
FY26లో కంపెనీ యొక్క EV పోర్ట్‌ఫోలియో 92,000 యూనిట్ల అమ్మకాలను జరిపింది . ఇది గత ఏడాదితో పోలిస్తే 43% వృద్ధి సాధించింది అని చెప్పుకోవచ్చు . చివరి త్రైమాసికంలోనే రికార్డు స్థాయిలో EV విక్రయాలు నమోదయ్యాయి. అందులో మార్చి నెలలో అత్యధిక అమ్మకాలు జరిపింది .
అదే సమయంలో CNG సెగ్మెంట్ లో విక్రయాలు 24% పెరిగి ఇయర్ కి అమ్మకాలు సుమారు 1.72 లక్షల యూనిట్లను చేరుకున్నాయి.

టాటా లక్ష్యం
టాటా మోటార్స్ FY26 సెకండ్ హాఫ్ ఇయర్ లో హోల్‌సేల్స్ , రిజిస్ట్రేషన్లలో స్థిరమైన వృద్ధితో కంపెనీని నంబర్ 2 స్థానంలో నిలిపాయి. అధిక డిమాండ్ కారణంగా నెక్సాన్ , పంచ్ వంటి ప్రజాదరణ పొందిన మోడళ్లకు వేచి చూసే సమయం పెరిగే అవకాశం ఉంది.

దానితోపాటు బ్రాండ్‌ను చూసే విధానంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి . టాటా మోటార్స్ ఇకనుండి కేవలం విలువ గురించి మాత్రమే కాకుండా . కొనుగోలుదారులు భద్రత, సాంకేతికత, ఎలక్ట్రిక్ మొబిలిటీ అందించే విధానం పై ఎక్కువ దృష్టిని సారిస్తుంది .
టాటా మోటార్స్ FY26ను అత్యుత్తమ విక్రయాలతో ముగించడం ద్వారా భారత ఆటోమొబైల్ రంగంలో తన స్థానం మరింత బలపరచుకుంది. నెక్సాన్, పంచ్ వంటి SUVలు, EVలు , CNG మోడళ్లలో వచ్చిన స్థిరమైన వృద్ధి కంపెనీకి విభిన్న సెగ్మెంట్ ల్లో విజయాన్ని అందించాయి. అధిక డిమాండ్ కారణంగా సరఫరా ఆలస్యం కావచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది బలమైన రీసేల్ విలువ పెంచడంతోపాటు వినియోగదారుల విశ్వాసాన్ని పెంచుతుంది. భద్రత, సాంకేతికత, ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టి పెట్టడం ద్వారా టాటా మోటార్స్ కేవలం విలువ ఆధారిత బ్రాండ్‌గా కాకుండా భవిష్యత్తు ఆటోమొబైల్ మార్కెట్ లో కీలక పాత్ర పోషించే సంస్థగా ఎదుగుతోంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu