Dailyhunt
Project sapphire: ఇరాన్‌లోని యురేనియంపై ట్రంప్ టార్గెట్,  కజకిస్థాన్‌పై చేసిన 'ప్రాజెక్ట్ సఫైర్‌' వంటి మరో ఆపరేషన్‌ అమెరికా చేస్తుందా?

Project sapphire: ఇరాన్‌లోని యురేనియంపై ట్రంప్ టార్గెట్, కజకిస్థాన్‌పై చేసిన 'ప్రాజెక్ట్ సఫైర్‌' వంటి మరో ఆపరేషన్‌ అమెరికా చేస్తుందా?

Times Now Telugu 1 week ago

రాన్ -ఇజ్రాయెల్,అమెరికా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల యురేనియం స్వాధీనంపై అమెరికా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

ఇరాన్ వద్ద ఉన్న 60 శాతం శుద్ది చేసిన యురేనియం నిల్వలను ట్రంప్ టార్గెట్ చేసినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనంలో పేర్కొంది.

ఇరాన్ దేశం వద్ద అణ్వాయుధ తయారీకి అవసరమైన స్థాయిలో శుద్దిచేసిన యురేనియం నిల్వలు ఉన్నాయి. దీంతో అమెరికా ఆందోళన చెందుతోంది, ఇరాన్‌ ఆ యురేనియాన్ని అప్పగించేలా ఒత్తిడి చేస్తుంది. యుద్దం ముగించేందుకు చేసే చర్చల్లో భాగంగా దీనిని చేర్చే ప్రయత్నంలో అగ్రరాజ్యం ఉంది. యురేనియం నిల్వలను ఇరాన్ నుండి స్వాధీనం చేసుకునేందుకు అమెరికా, మిలిటరీ ఆపరేషన్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఇరాన్ భూభాగంలో ప్రవేశించిం, అత్యంత ప్రమాదకరమైన ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే అమెరికా సైనిక దళాలను పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అమెరికా భారీ సంఖ్యలో కమాండోలు, ఆర్మీ రేంజర్లు, నేవీ సీల్స్‌ను కూడా అక్కడికి తరిలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలంటే అంతర్జాతీయ, భౌగోళిక రాజకీయంగా తీవ్రమైన ముప్పు కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

32 ఏళ్ల క్రితం అమెరికా ప్రభుత్వం ఆపరేషన్ సఫైర్‌ ను చేసింది. క్లింటర్ పాలనలో 1994లో సోవియట్ యూనియన్ పతనం తరువాత ప్రారంభించిన ఓ రహాస్య ఆపరేషన్ ఇది. కజకిస్తాన్‌లోని ఉల్బా మెటలర్జికల్ ఫెసిలిటీ అనే సరైన రక్షణ లేని ప్రాంతంలో నిల్వ ఉంచిన దాదాపు 600 కిలోగ్రాముల HEU (అత్యంత సుసంపన్నమైన యురేనియం)ను ఈ ఆపరేషన్ ద్వారా కనిపెట్టారు. ఈ యురేనియాన్ని సోవియట్ ఆల్ఫా క్లాస్ జలాంతర్గాములతో ఉపయోగించడం కోసం తయారు చేశారు. ఈ యురేనియానికి సుమారుగా 20 అణ్వాయుధాలను తయారు చేసే సామర్థ్యం ఉంది.

HEU స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఒక రహస్య దౌత్య , లాజిస్టికల్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. 31 మంది టెక్నీషియన్స్, ప్రొఫెషనల్స్‌తో సుమారుగా 4 వారాల పాటు కష్టపడి HEUను 400 ప్రత్యేమైన కంటైనర్స్ ద్వారా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచన ప్రమాదకరమైనదని అమెరికాకు చెందిన మాజీ సైనికాధికారులు అంటున్నారు.
పలు రిపోర్ట్స్ ప్రకారం, ఆసియా ఖండంలోని కజకిస్తాన్ నుండి తీసుకున్న యురేనియం నిల్వలకు గాను అమెరికా ఆ దేశానికి పరిహారం చెల్లించింది. ఈ ఆపరేషన్‌లో సుమారు 31 మంది సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. దాదాపు నాలుగు వారాల పాటు రాత్రి, పగలు విరామం లేకుండా పనిచేసినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఈ హెచ్‌ఈయూ (HEU)ను ప్రత్యేక షిప్పింగ్ కంటైనర్లలో, సి-5 గెలాక్సీ కార్గో విమానంలో డెలావేర్‌కు రవాణా చేశారు.

ఇరాన్ దేశం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదనకు అంగీకరించకపోతే, బలవంతంగానైనా యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. అమెరికా దళాల సాయంతో ఇరాన్ న్యూక్లియర్ సైట్లలోని యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇరాన్, అమెరికా మధ్య చర్చల కోసం పాకిస్థాన్ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఆ చర్చలు ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని ట్రంప్ భావిస్తున్నారు. రాజీ చర్చలు సరైన ఫలితాలను ఇవ్వకపోతే ట్రంప్ తన ప్లాన్‌ను అమలు చేసే అవకాశం ఉంది.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu