Dailyhunt
Raaka గా అల్లు అర్జున్! నెవర్ బిఫోర్ లుక్‌లో బన్నీ... శంకర్ - విక్రమ్ సినిమాలా ఉందంటూ...

Raaka గా అల్లు అర్జున్! నెవర్ బిఫోర్ లుక్‌లో బన్నీ... శంకర్ - విక్రమ్ సినిమాలా ఉందంటూ...

Times Now Telugu 1 week ago

Raaka movie Allu Arjun: 'పుష్ప 2' తర్వాత తమిళ దర్శకుడు అట్లీ కుమార్ దర్శకత్వంలో మూవీ అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మైథలాజికల్ మూవీని కాదని, పాత సినిమాలను కలిపి పులిహోర చేసి, హిట్లు కొట్టే అట్లీతో సినిమాని సెట్స్ మీదకి తీసుకెళ్లడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

అయితే అల్లు అర్జున్‌కి కెరీర్ మొదటి నుంచి స్క్రిప్ట్‌పై మంచి క్లారిటీ ఉంది. స్టార్ హీరోల్లో అత్యధిక సక్సెస్ రేటు ఉన్న తెలుగు హీరో కూడా బన్నీయే. అదీకాకుండా అనౌన్స్‌మెంట్‌తోనే హాలీవుడ్ రేంజ్‌లో హడావుడి చేయడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా #AlluArjun22XA6 మూవీ టైటిల్‌ని రివీల్ చేసింది చిత్ర యూనిట్. ఈ మూవీకి 'అయాన్', 'స్పార్క్' అనే టైటిల్స్ ప్రచారం జరిగినా.. మూవీ యూనిట్ మాత్రం 'Raaka' అనే టైటిల్‌ని అనౌన్స్ చేస్తూ షాకింగ్ లుక్ రివీల్ చేసింది.

  • నెవర్ బిఫోర్ లుక్‌లో అల్లు అర్జున్...

గుండుతో పెద్ద గోర్లతో ఉన్న బీస్ట్ లుక్‌తో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్. పాన్ వరల్డ్ రేంజ్‌లో ఏదో ఓ కొత్త కాన్సెప్ట్‌తో మూవీ రాబోతున్నట్టుగా పోస్టర్ ద్వారా హింట్ ఇచ్చాడు డైరెక్టర్ అట్లీ. అంతకుముందు గతంలో 'పరుగు' మూవీలో ఓ సాంగ్‌లో ఇలా రకరకాల వేషాల్లో కనిపించాడు అల్లు అర్జున్. అలాగే శంకర్ - విక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఐ - మనోహరుడు' మూవీలో కూడా ఓ సాంగ్‌లోని స్టిల్స్‌ని రిలీజ్ చేయడం వల్ల భారీ హైప్ వచ్చింది. తీరా మూవీలో అవేమీ లేకపోవడంతో ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశచెందారు.

అయితే అల్లు అర్జున్ అలాంటి తప్పు చేయడని చాలా మంది నమ్మకం. ఎస్. ఎస్. రాజమౌళితో సినిమా చేయకుండా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్, 'పుష్ప' మూవీతో బాలీవుడ్‌ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాడు.

  • డీటైయిలింగ్ అదిరింది..

సన్ పిక్చర్స్ నిర్మాణంలో అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో సినిమా అనౌన్స్‌మెంట్ సమయంలో హాలీవుడ్ టెక్నీషియన్లతో, అత్యద్భుతమైన వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ వీడియోలో అల్లు అరజున్, ఓ రాకాసి చేతిని పట్టుకుని చూస్తూ ఎగ్జైట్ అవ్వడం కనిపించింది. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఇదే స్టిల్‌ని రివీల్ చేసి, ఫ్యాన్స్‌ని ఆశ్చర్యపరిచింది 'రాకా' చిత్ర యూనిట్...

ఈ మూవీని రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది సన్ పిక్చర్స. 'రాకా' మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అట్లీ ఏ సినిమా తీసినా కనీసం ఇద్దరు, ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఇందులో మృణాల్ ఠాకూర్ ఓ హీరోయిన్‌గా నటిస్తోందని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని మృణాల్ ఠాకూర్ కన్ఫార్మ్ చేసింది.

  • అనిరుథ్ అవుట్, సాయి అభ్యంకర్ ఇన్...

అప్పుడెప్పుడో 'పుష్ప 2' మూవీ ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోకముందే అట్లీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించాడు అల్లు అర్జున్. ఈ సినిమాకి అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తాడని కూడా కన్ఫార్మ్ చేసేశాడు. అల్లు అర్జున్ - అట్లీ - అనిరుథ్ రవిచందర్.. ఇలా RRR స్టైల్‌లో AAA మూవీ రాబోతున్నట్టుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రెండ్ కూడా చేశారు . అయితే కొన్ని కారణాల వల్ల అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ నుంచి అనిరుథ్ రవిచందర్ తప్పుకున్నాడు. Raaka మూవీకి 20 ఏళ్ల యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు..

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu