'రానా దగ్గుబాటి సమర్పించు' అనే బ్యానర్‌కి ఓ స్పెషల్ బ్రాండ్ ఉంది. 'కేరాఫ్ కంచరపాలెం', 'కృష్ణా అండ్ హీస్ లీల', '777 ఛార్జీ', 'విరాట్ పర్వం', 'గార్గీ' వంటి కంటెంట్ ఉన్న సినిమాలతో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నడు రానా దగ్గుబాటి.
గతంలో డిస్టిబ్యూటర్‌గా 'ఆల్ వీ ఇమాజిన్ ఆస్ లైట్' అనే హిందీ సినిమాని ఇండియాలో డిస్టిబ్యూట్ చేసిన రానా దగ్గుబాటి, మరాఠీ సినిమా 'సబర్ బొండా' మూవీని కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఇండీ సినిమాలకు సరికొత్త ఫ్లాట్‌ఫామ్‌గా మారుతూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా... భాషతో సంబంధం లేకుండా అన్ని భాషలకు చెందిన చిన్న చిత్రాలను, క్రియేటివ్ కథలను సపోర్ట్ చేస్తూ, థియేటర్లలోకి తీసుకురావడానికి 'స్పిరిట్ మీడియా' గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడిన సినిమాలను, తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే నిజాయితీ గల కథలను ప్రేక్షకుల వద్దకు తీసుకురావడమే లక్ష్యంగా స్పిరిట్ మీడియా నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి.
టాలెంట్ ఉన్నా పెద్దగా గుర్తింపు దక్కించుకోలేకపోయిన డైరెక్టర్లకు, రచయితలకు ఇదో అద్భుతమైన అవకాశం. తమ కథలను దేశమంతటికీ చూపించే అద్భుతమైన ఛాన్స్ దొరకనుంది. ఇండీ ఫిల్మ్ మూమెంట్‌లో భాగంగా సిక్కిం, అస్సాం, మణిపూర్ లాంటి ఈశాన్య రాష్ట్రాల నుంచి కంటెంట్ ఉన్న సినిమాలు, మూవీ లవర్స్‌కి ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తున్నాయి.
ఈశాన్య రాష్ట్రాల్లోని భిన్నమైన కల్చర్, హ్యూమన్ ఎమోషన్స్‌ని అందంగా చూపిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ని ఆకర్షిస్తున్నారు ఈశాన్య రాష్ట్రాల మూవీ మేకర్స్. ఈ శుక్రవారం సిక్కిం మూవీ 'షేప్ ఆఫ్ మోమో' మూవీ థియేటర్లలోకి రానుంది.
- ఇప్పటికే 15 అంతర్జాతీయ అవార్డులు...
ట్రిబేనీ రాయ్ దర్శకత్వం వహించిన 'షేప్ ఆఫ్ మోమో' మూవీ, ఇప్పటికే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో 15కి పైగా అవార్డులు గెలిచింది. జోయా అక్తర్, పాయల్ కపాడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించిన 'షేప్ ఆఫ్ మోమో' మూవీ స్పిరిట్ మీడియా ద్వారా థియేటర్లలోకి రానుంది. సౌత్, నార్త్‌తో సమానంగా ఈశాన్య రాష్ట్రాల సినిమాలకు కూడా సమానమైన ప్రాధాన్యం ఇస్తూ, భారతీయ సినిమా అనే పదానికి పర్ఫెక్ట్ అర్థం వచ్చేలా సంస్కృతిని నిర్మిస్తోంది స్పిరిట్ మీడియా.
Read more news like this on telugu.timesnownews.com

