రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650 , బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 రెండు క్లాసిక్ మోటార్‌సైకిళ్లు. వీటికి ప్రత్యేకమైన స్టైల్ , వారసత్వం, రైడింగ్ అనుభవం కలిగి ఉన్నాయి.
బుల్లెట్ 650 అనేది రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క వారసత్వాన్ని ప్రతిబింబించే మోడల్.ఇది శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు సాంప్రదాయిక డిజైన్‌ను కలిగి ఉంటుంది. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బ్రిటిష్ మోటార్‌సైకిల్ ఆధునిక సాంకేతికతతో పాటు క్లాసిక్ లుక్‌ను అందిస్తుంది. ఈ రెండు బైకులు రైడర్లకు పవర్ , స్టైల్, ప్రత్యేకమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తాయి. ఒకటి భారతీయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తే ఇంకోటి బ్రిటిష్ ఇంజినీరింగ్‌ను ప్రతిబింబిస్తుంది .ఈ రెండు బైకుల ధరలు , మైలేజ్ , ఫీచర్స్ , ప్రత్యేకతల వివరాలు చూద్దాం .
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650
ఈ మోడల్‌లో 648cc ట్విన్-సిలిండర్ parallel-twin ఇంజన్ ఉంటుంది . ఇది సుమారు 47 bhp @ 7250 rpm పవర్ , 52.3 Nm @ 5650 rpm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6- స్పీడ్ కాన్స్టెంట్ మెష్ గేర్‌బాక్స్‌తో పాటు స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుంది . దీని మైలేజ్ సుమారు 22-25 km/l వరకు ఉంటుంది.
ఫీచర్స్
upright రైడింగ్ పొజిషన్, సౌకర్యవంతమైన స్టెప్-అప్ బెంచ్ సీట్, రైజ్డ్ హ్యాండిల్ బార్ , స్క్వేర్ రియర్ ఫెండర్ వంటి సంప్రదాయ బుల్లెట్ డిజైన్ ఫీచర్స్ కంటిన్యూ చేసారు .
analogue + డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్యూయల్ gauge, గేర్ పోసిషన్ ఇండికేటర్, సర్వీస్ రిమైండర్, USB ఛార్జింగ్ పోర్ట్, ట్రిప్పర్ నావిగేషన్ పోడ్, LED casquette హెడ్ లాంప్ , ట్విన్ టైగర్ ఐ లాంప్స్, peashooter క్రోమ్ exhausts వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
ఫ్రేమ్ స్టీల్ ట్యూబులర్ స్పైన్ డిజైన్ తో బలంగా ఉంటుంది. ముందు Showa 41mm టేలీస్కోపిక్ ఫోర్క్స్ 120mm ట్రావెల్‌తో, వెనుక ట్విన్-ట్యూబ్ హైడ్రాలిక్ షొక్స్ 112mm ట్రావెల్‌తో ఉంటాయి .
బ్రేకింగ్ లో ముందు 320mm డిస్క్ ట్విన్ పిస్టన్ caliper, వెనుక 300mm డిస్క్ ట్విన్ పిస్టన్ caliper కలిగిన డ్యూయల్-చానల్ ABS ఉంటుంది .
భద్రత పరంగా ABSతో పాటు బలమైన బ్రేకింగ్ సిస్టమ్, హైడ్రాలిక్ సస్పెన్షన్ అందించారు . రంగుల పరంగా Cannon Black, Battleship Blueవంటి ఆకర్షణీయమైన కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంది.
ధర
బుల్లెట్ 650 చెన్నై ఎక్స్ షో రూమ్ ధర 3,64,856/-
BSA GOLD STAR 650
ఇది క్లాసిక్ రెట్రో మోటార్‌సైకిల్ బ్రిటిష్ వారసత్వాన్ని ఆధునిక సాంకేతికతతో కలిపి ప్రత్యేకమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ బైక్‌లో 652cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది . ఇది 44PS పవర్ , 55Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల రైడర్‌కు శక్తివంతమైన , సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం లభిస్తుంది. మైలేజ్ అధికారికంగా ప్రకటించలేదు కానీ సుమారు 25-30 km/l వరకు ఇవ్వగలదని అంచనా.
ఫీచర్స్
Brembo డిస్క్ బ్రేకులు, ABS సిస్టమ్, Pirelli Phantom Sportscomp టైర్లు, Excel వైర్ స్పోక్ రిమ్స్ ఉన్నాయి. డిజైన్ రెట్రో స్టైల్‌లో ఒరిజినల్ గోల్డ్ స్టార్ వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సస్పెన్షన్‌లో ముందు 41mm టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక 5-స్టెప్ అడ్జస్టబుల్ ప్రీలోడ్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. బ్రేకింగ్ సిస్టమ్‌లో ముందు 320mm Brembo ట్విన్-పిస్టన్ ఫ్లోటింగ్ కాలిపర్, వెనుక 255mm Brembo సింగిల్-పిస్టన్ కాలిపర్ ABS తో సేఫ్టీని అందిస్తుంది .
ఈ బైక్ బరువు 213kg, సీటు ఎత్తు 782mm మాత్రమే ఉండటం వల్ల రైడర్‌కు మంచి కంఫర్ట్ ఉంటుంది . Shadow Black , Insignia Red , Highland Green రంగుల లో అందుబాటులో ఉంది.
ధర
BSA GOLD STAR 650 ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర ₹3,45,950 /.
Read more news like this on telugu.timesnownews.com

