రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్ జైన్‌ను నియమించారు. మే 3వ తేదీ నుండి ఈయన బాధ్యతలు చేపట్టనున్నారు. అపాయింట్‌మెంట్ కమిటీ ఆఫ్ కేబినేట్(ACC) రోహిత్ జైన్ నియామకాన్ని ధృవీకరించింది.
మూడేళ్లపాటు ఈయన పదవిలో కొనసాగనున్నారని, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) తెలిపింది. ఆర్‌బీఐ ప్రస్తుత డిప్యూటీ గవర్నర్ జైన్ తర్వాత రోహిత్ జైన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న రోహిత్ జైన్... రిజర్వ్ బ్యాంక్‌లో సూపర్ వైజరీ, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ ఇతర విభాగాల్లో పనిచేశారు. 2020లో రోహిత్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రోహిత్ జైన్ పర్యవేక్షణ విభాగాన్ని (రిస్క్, అనలటిక్స్ అండ్ వల్నరబిలిటీ అసెస్‌మెంట్ )ను పర్యవేక్షించారు.
రోహిత్ జైన్... కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ పూర్తిచేశాడు. వీటితో పాటు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఇన్ బ్యాంకింగ్ రిస్క్ అండ్ రెగ్యులేషన్ (ICBRR), సర్టిఫైడ్ అసోసియేట్ ఆఫ్ ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (CAIIB), సర్టిఫైడ్ బ్యాంక్ ట్రైనర్ వంటి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)కు సాధారణంగా ఒక గవర్నర్ , నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఇద్దరు డిప్యూటీ గవర్నర్లను వారీ ర్యాంకుల ఆధారంగా నియమించబడ్డారు. మరో ఇద్దరు పూనమ్ గుప్తా, స్వామినాథన్ జె. ఆర్‌బీఐ యాక్ట్, 1934 ప్రకారం, సెంట్రల్ బ్యాంకులో నలుగురు డిప్యూటీ గవర్నర్స్ ఉండాలి. ఇద్దరు బ్యాంకు అంతర్గత సిబ్బంది, ఒకరు కమర్షియల్ బ్యాంకర్, మానెటరీ పాలసీ డిపార్ట్‌మెంట్‌కు అధిపతిగా ఒక ఆర్థికవేత్త ఉండాలి.
Read more news like this on telugu.timesnownews.com

