తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత, హీరో విజయ్ ఎన్నికవ్వడం లాంఛనమే అని తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా టీవీకే అవతరించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే 105 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న విజయ్ ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.
ఎవరూ ఊహించని రీతిలో ఏ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దొరకని విధంగా విజయ్ దూసుకుపోతున్నారు. తమిళనాట రాజకీయాల్లో 1967 నుంచి రాజ్యమేలుతున్న ద్రవిడ పార్టీలకు విజిల్ పార్టీ చుక్కలు చూపించింది. ఇకపోతే ఇంత తక్కువ సమయంలో ఇంతలా విజయ్ పార్టీ విజృంభించడానికి రాజకీయ శూన్యత ఒక కారణం అయితే విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో ఒక మంత్రంగా మారిందనే ప్రచారం జోరుగా సాగుతుంది. విజయ్ ప్రకటించిన మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన హామీలను చూద్దాం.
తమిళమనసుకు దగ్గరగా విజయ్ మేనిఫెస్టో
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో టీవీకే అధినేత,హీరో విజయ్ సరికొత్త రికార్డు సృష్టించారు. పార్టీ పెట్టిన రెండేళ్ల కాలంలోనే అధికార పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నారు. తమిళనాడులో వస్తున్న ఎన్నికల ఫలితాలు విజయ్‌కు పట్టాభిషేకం ఖాయంగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఇంతలా విజయ్ పార్టీకి దూసుకుపోవడానికి అనేక కారణాలు లేకపోలేదు. హీరో విజయ్ ద్రవిడ పార్టీలను ధీటుగా ఎదుర్కొనేందుకు రచించిన వ్యూహం సక్సెస్ అయితే బీజేపీని ధీటుగా ఎదుర్కొన్నారు. అలాగే తమిళనాడులో ప్రజలు ఎదుర్కొంటున్న అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన విజయ్ ప్రజల మనస్సులను హత్తుకునే విధంగా మేనిఫెస్టో రూపొందించారు.
మహిళలు, యువత, రైతుకే ప్రాధాన్యం
ఇకపోతే విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంది అని చెప్పడానికి ఎన్నికల మేనిఫెస్టో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తామని ప్రకటిస్తూనే ఉన్నారు. అంతేకాదు హీరోగా ఓ వెలుగు వెలుగొందుతున్నప్పుడు రాజకీయ పార్టీ పెట్టనప్పుడు కూడా కేంద్రంలోని ఎన్డీఏపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అలా పార్టీ పెట్టకముందే విజయ్ తమిళనాడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ క్రమంలోనే అన్ని పార్టీలకు భిన్నంగా మేనిఫెస్టోరూపొందించారు. ముఖ్యంగా యువత, మహిళలు, రైతులను ఆకట్టుకునేలా రూపొందించిన మేనిఫెస్టో ఒక మంత్రంలా మారింది అని తెలుస్తోంది.
ఫలించిన టీవీకే మేనిఫెస్టో మంత్రం
ఇకపోతే టీవీకే అధినేత, హీరో ప్రకటించిన మేనిఫెస్టో సైతం ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. ఏప్రిల్ 16న విజయ్ తన పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. మహిళలు, యువత, రైతాంగాన్ని ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించారు. ఈ మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.
1.మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సహాయం
2. సంవత్సరానికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు
3. ప్రతీ ఆడపిల్ల వివాహ సమయంలో 8 గ్రాముల బంగారం
4. విద్యార్థుల తల్లులకు ఏటా రూ.15,000,
5. 29 ఏళ్లు దాటినా జాబ్ లభించని గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 4,000, డిప్లొమా పూర్తి చేసిన వారికి నెలకు రూ. 2 వేలు చొప్పున నిరుద్యోగ భృతి.
6. 5 లక్షల ఇంటర్న్‌షిప్‌లు,
6. 5 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు.
7. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు 50% వ్యవసాయ కోఆపరేటివ్ రుణమాఫీ, వరి క్వింటాలుకు రూ.3,500, చెరుకు టన్నుకు రూ.4,500 కనీస మద్దతు ధర (MSP).
8.కుటుంబానికి ₹25 లక్షల ఆరోగ్య బీమా, ఆధునిక ఆసుపత్రులు
9. 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
10. 'వెట్రి TN' సూపర్ యాప్ ద్వారా 21 రోజుల్లో పౌర సేవలు, అవినీతి రహిత పాలన.
11. మాదకద్రవ్యాల రహిత రాష్ట్రాన్ని నిర్మించేందుకు ప్రత్యేక విధానాలను అమలు చేస్తానని టీవీకే పార్టీ హామీ.
12. తమ సంస్థలోని మొత్తం సిబ్బందిలో 75 శాతం మంది తమిళులను నియమించుకునే ప్రైవేట్ కంపెనీలకు రాష్ట్ర జీఎస్‌టీ (SGST)లో 2.5 శాతం సబ్సిడీ, విద్యుత్ ఛార్జీలలో 5 శాతం రాయితీ, ప్రభుత్వ కొనుగోళ్లలో ప్రాధాన్యత కల్పిస్తామని విజయ్ హామీ.
Read more news like this on telugu.timesnownews.com

