Dailyhunt
రిలయన్స్ జియో కొత్త  4G ఫీచర్ ఫోన్ ప్లాన్స్... కొత్త ప్లాన్స్ ధరలు, బెనిఫిట్స్ వివరాలు

రిలయన్స్ జియో కొత్త 4G ఫీచర్ ఫోన్ ప్లాన్స్... కొత్త ప్లాన్స్ ధరలు, బెనిఫిట్స్ వివరాలు

Times Now Telugu 5 days ago

రిలయన్స్ జియో లేటెస్ట్ గా ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 4G ఫీచర్ ఫోన్ ప్లాన్స్ ను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్స్ తో పాత జియోఫోన్ , జియోభారత్ ప్లాన్స్‌ను మార్చుతూ వినియోగదారులకు మరింత స్పష్టతతో కూడిన ఆఫర్లు అందించనున్నారు .

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఫోన్స్ ఆధారిత రీచార్జ్ ప్లాన్స్‌లో పారదర్శకత లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో రీచార్జ్ ప్లాన్స్‌లో జియో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ మార్పు వల్ల జియోఫోన్ లేదా 4G కీప్యాడ్ ఫోన్ ఉపయోగిస్తున్న వినియోగదారులు నేరుగా ప్రభావితమవుతారు. కొత్త ప్లాన్స్ ద్వారా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా, SMS ఫీచర్స్ అందించబడతాయి. యూత్ , గేమింగ్ ప్లాన్ వంటి ప్రత్యేక ఆఫర్లు కూడా తీసుకువచ్చారు . వీటిలో గేమింగ్, సోషల్ మీడియా, క్లౌడ్ స్టోరేజ్, డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు వంటి అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి.
జియో వినియోగదారులకు సులభమైన ఎంపికలు, ఎక్కువ పారదర్శకత, విస్తృత ప్రయోజనాలు అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త ప్లాన్స్ అందిస్తుంది . ఈ ప్లాన్స్ టెలికాం రంగంలో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా ఇతర కంపెనీలతో గట్టి పోటీని ఇవ్వనుంది.
జియో కొత్త 4G ఫీచర్ ఫోన్ ప్లాన్స్
ఎంట్రీ లెవెల్ ప్లాన్ ఇప్పుడు ₹123 నుండి మొదలవుతుంది . ఇందులో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 0.5GB డేటా (మొత్తం 14GB), 300 SMSలు అందించబడతాయి. ఈ ప్లాన్‌కు 28 రోజుల కాల పరిమితిగా ఉంటుంది.

డేటా యాడ్ ఆన్ & కొత్త బడ్జెట్ ప్లాన్స్
జియో అనేక డేటా యాడ్-ఆన్ ప్లాన్స్ తీసుకువచ్చింది.అవి Rs 26 కి 2GB డేటా, Rs 62 కి 6GB డేటా అందిస్తున్నారు.
రోజువారీ డేటా బూస్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో ₹86 ప్లాన్ లో రోజుకు 0.5GB డేటా, ₹122 ప్లాన్ లో రోజుకు 1GB డేటా, ₹182 ప్లాన్ లో రోజుకు 2GB డేటాఅందిస్తున్నారు.ఈ అన్ని ప్లాన్స్‌కు 28 రోజుల కాల పరిమితి ఉంటుంది.

చాల తక్కువ ధరలో జియో అందిస్తున్న ₹21 రీచార్జ్ ప్లాన్ ప్రత్యేకమైన ఆఫర్‌గా నిలుస్తోంది. ఇది తక్కువ ధరలో లభ్యమవుతున్నప్పటికీ ఇది షరతు తో కుడి ఉంటుంది.ఇది కొత్త 4G ఫీచర్ ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 0.5GB డేటా, 15 SMSలు అందించబడతాయి. కానీ దీని కాల పరిమితి కేవలం నాలుగు రోజులు మాత్రమే. దీన్ని లాంగ్ టైం యూజింగ్ ఆప్షన్‌గా కాకుండా స్టార్టర్ ప్యాక్‌గా చూడాలి . కొత్త వినియోగదారులు తక్కువ ఖర్చుతో జియో సేవలను ప్రారంభించేందుకు ప్రత్యేకంగా రూపొందించారు .
జియో ₹91 ప్లాన్‌ను నిలిపివేసింది.ఇది ఇప్పటివరకు అత్యంత తక్కువ ధరలో లభించే ప్లాన్ లలో ఒకటిగా ఉండేది. వినియోగదారులకు ఎంట్రీ లెవెల్ ప్లాన్ ₹123 వద్ద మొదలవుతోంది. ఈ ప్లాన్ ముందుతో పోలిస్తే కొంచెం ఎక్కువ గా ఉన్నపటికీ ఈ మార్పు ద్వారా జియో తన ఫీచర్ ఫోన్ వినియోగదారులకు మరింత స్థిరమైన , స్పష్టమైన ఆఫర్లను అందించడానికి తీసుకున్న నిర్ణయంగా భావించవచ్చు.

Read more news like this on telugu.timesnownews.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Times Now Telugu