ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన రంగంలో కొత్త తరహా డిజైన్ తో రివర్ ఇండీ స్కూటర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆధునిక డిజైన్, శక్తివంతమైన బ్యాటరీ, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం ఈ స్కూటర్‌ను యువతకు ఆకర్షణీయంగా ఉండేలా చేసాయి .
నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు, భారంగా మారుతున్న ఇంధన ధరలు, పర్యావరణ పరిరక్షణ అన్నివిధాలుగా ఎలక్ట్రిక్ వాహనాల ప్రాధాన్యతను పెంచుతున్నాయి. రివర్ ఇండీ స్కూటర్ ఈ అవసరాలకు అవసరాలకు అనుగుణంగా రూపొందించారు . విస్తృతమైన స్టోరేజ్ స్పేస్, స్మార్ట్ ఫీచర్లు, స్టైలిష్ లుక్ తో ప్రయాణంతోపాటు వినియోగదారులకు లైఫ్‌స్టైల్ ఎంపికగా మారింది. సైలిష్ లుక్ తోపాటు తక్కువ మెయింటనెన్స్ కోరుకునే వారికీ బెస్ట్ స్కూటర్ గా నిలుస్తుంది.
రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్
రివర్ ఇండీ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతీయ మార్కెట్లో SUV తరహా డిజైన్‌తో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ స్కూటర్ 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. ఇది 4.5 kW పవర్ , 26Nm టార్క్ ను అందిస్తుంది.ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 163 KM వరకు ప్రయాణించగలదు. 6.7 kW పవర్‌తో ఇది 90 కి.మీ/గం టాప్ స్పీడ్ అందిస్తుంది. 0-40 కి.మీ/గం వేగాన్ని కేవలం 3.7 సెకన్లలో చేరుతుంది. నగర రోడ్లలో, ట్రాఫిక్ పరిస్థితుల్లో సులభంగా ప్రయాణించడానికి ఇది అనువైనది.
ఫీచర్స్
6 ఇంచ్ కలర్ డిస్ప్లే , USB ఛార్జింగ్ పోర్ట్, వాటర్‌ప్రూఫ్ ఫోన్ హోల్డర్, రివర్స్/ఫార్వర్డ్ పార్కింగ్ అసిస్టు, అల్ LED లైట్స్ వంటి స్మార్ట్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో Eco, Ride, Rush మూడు రైడింగ్ మోడ్స్ ఉంటాయి.
SUV తరహా ముందు , వెనుక 14 అంగుళాల వీల్స్, బలమైన స్టీల్ చాసిస్, డ్యూయల్ సస్పెన్షన్ సిస్టమ్ వలన రైడింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.
సేఫ్టీ పరంగా రివర్ ఇండీ ముందు వెనుక 200 mm డిస్క్ బ్రేకులు Combined Braking System తో ఉంటుంది. IP67 మోటార్ , బ్యాటరీ, IP65 ఎలక్ట్రానిక్స్ సర్టిఫికెట్ కలిగి ఉంటుంది .ఇది రైడర్‌కు మంచి నియంత్రణను అందిస్తుంది.
55 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కలిగి ఉండడం ఈ స్కూటర్ ప్రత్యేకత. అండర్‌సీట్‌లో 43 లీటర్లు, గ్లోవ్‌బాక్స్‌లో 12 లీటర్లు ఉండటం వలన రెండు హెల్మెట్లు, ల్యాప్‌టాప్, వీకెండ్ బ్యాగ్ ను కూడా సులభంగా పెట్టుకోవచ్చు.
దీని బ్యాటరీ 0-80% ఛార్జ్ 750W చార్జర్ తో 5 గంటలు , 480W చార్జర్ తో 8 గంటల సమయం పడుతుంది.డిజైన్ పరంగా ఇది స్టైలిష్‌గా SUV తరహా లుక్‌తో వస్తుంది. Monsoon Blue, Summer Red, Spring Yellow, Winter White and Storm Grey రంగులలో ఈ స్కూటర్ యువతకు ఆకర్షణీయంగా ఉంటుంది.
ధర
సబ్సిడీతో హైదరాబాద్ ఎక్స్-షోరూమ్ ధర ₹1,47,999/-
తక్కువ నిర్వహణ ఖర్చు తో పర్యావరణహితమైన రివర్ ఇండీ స్కూటర్ ప్రయాణంతోపాటు లైఫ్‌స్టైల్ ఎంపికగా మారింది.
Read more news like this on telugu.timesnownews.com

